ఓటు చోరీపై సీఎంకి బీజేపీ చీఫ్ సవాల్ .
ఓటర్ల జాబితా నుంచి పేరు తొలగిపోయిన ఒక్క ఓటరునైనా ప్రజల ముందుకు తీసుకురావాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు ఎన్. రామచందర్‌రావు సవాల్ విసిరారు. ఎస్ఐఆర్ ప్రక్రియపై కాంగ్రెస్ దేశవ్యాప్తంగా అసత్య ప్రచారం చేస్తోందని ఆరోపించారు. కేంద్ర ఎన్నికల సంఘం సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా ఓటర్ల జాబితాను రూపొందించిందని పేర్కొన్నారు. చనిపోయినవారు, డూప్లికేట్ ఓటర్లు, ఇతర ప్రాంతాలకు వలస వెళ్లినవారి పేర్లను తొలగించడాన్ని తప్పుపట్టడం సరికాదన్నారు. ఈ చర్యలను ‘ఓటు చోరీ’గా అభివర్ణించడం ప్రజలను తప్పుదోవ పట్టించడమేనని విమర్శించారు. ఓటర్ల జాబితా సవరణపై కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలను ఆధారాలతో నిరూపించాలని డిమాండ్ చేశారు. గతంలో ఈవీఎంలను ప్రవేశపెట్టిన రాజీవ్‌గాంధీ నిర్ణయాన్ని బీజేపీ సమర్థించిందని గుర్తుచేశారు.
#RamchanderRao #RevanthReddy #TelanganaBJP #TelanganaCongress #VoterDeletion #SIR #VoterListRevision #VoteTheft #ElectionCommission #DuplicateVoters #VoterVerification #EVM #RajivGandhi #TelanganaPolitics #PoliticalNews











