ప్రజాస్వామ్య పోరుకు పోలీసు ప్రతిబంధకాలు!
సీఈసీ రాజీనామా డిమాండ్‌తో అట్టుడికిన హస్తిన.
జ్ఞానంతో వైదొలగాలని దేశవ్యాప్త ఆందోళనలు.
రాజ్యాంగం కల్పించిన నిరసన హక్కుకు విలువ లేదా? ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొంతులకు చోటు లేదా? ప్రభుత్వాన్ని నిలదీస్తే నిర్బంధాలే సమాధానమా? ఎన్నికల వ్యవస్థపై అనుమానాలు వ్యక్తం చేస్తే అడ్డుగోడలే స్వాగతమా? దేశ రాజధాని ఢిల్లీలో అక్టోబర్ 10న కనిపించిన దృశ్యాలు ఇవే ప్రశ్నలను దేశం ముందు నిలబెట్టాయి. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని, ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను ఉపసంహరించుకోవాలని కోరుతూ చేపట్టిన నిరసనకు అనుమతి నిరాకరణతో మొదలైన ఉద్రిక్తత.. చివరకు రాజధాని దిగ్బంధనానికి దారితీసింది. జంతర్ మంతర్‌కు చేరకముందే నాయకులను విమానంలోనే అదుపులోకి తీసుకోవడం, వీధుల్లో బారికేడ్లు, 45 మెట్రో స్టేషన్ల మూసివేత, రైళ్ల రద్దు, ఇంటర్నెట్ ఆంక్షలు, వేలాది మంది నిర్బంధాలతో ఢిల్లీ ఉక్కు పంజరంగా మారింది. రాజకీయ నాయకుల నుంచి విద్యార్థుల వరకు, కార్యకర్తల నుంచి న్యాయవాదుల వరకు పోలీసు చర్యలను ఎదుర్కొన్నారన్న వార్తలు కలకలం రేపాయి. శాంతిభద్రతల పరిరక్షణ కోసం తీసుకున్న చర్యలని పోలీసులు చెబుతుంటే.. ప్రజాస్వామ్య గొంతును నొక్కే ప్రయత్నమని నిరసనకారులు మండిపడుతున్నారు. అసలు ఎన్నికల వ్యవస్థపై వచ్చిన ప్రశ్నలకు సమాధానాలేవి? నిరసనను అడ్డుకోవడమే పరిష్కారమా? ప్రజాస్వామ్యంలో ప్రజల గొంతుకే ప్రమాదమైతే.. రాజ్యాంగం ఇచ్చిన హక్కులకు రక్షణ ఎక్కడ? ఢిల్లీలో జరిగిన పరిణామాల వెనుక అసలేం జరిగింది?
#DelhiProtest #GyaneshKumar #CECResignation #ElectionCommission #SIR #VoterList #VoterRights #JantarMantar #DelhiPolice #RightToProtest #IndianConstitution #Democracy #ElectoralTransparency #PoliticalNews #IndiaNews











