హుజూర్‌నగర్ నుంచే బరిలో .
తేల్చి చెప్పిన కెప్టెన్ .
తెలంగాణ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి తన రాజకీయ భవిష్యత్తుపై వస్తున్న ఊహాగానాలకు స్పష్టత ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో తాను హుజూర్‌నగర్ నియోజకవర్గం నుంచే పోటీ చేస్తానని తేల్చిచెప్పారు. డీలిమిటేషన్ తర్వాత తుంగతుర్తి నియోజకవర్గానికి మారుతారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఉత్తమ్ కుమార్ రెడ్డి, నియోజకవర్గం మారుతున్నాననే వార్తలను ఎవరూ నమ్మొద్దని కోరారు. తుంగతుర్తి పరిధిలోని తన స్వగ్రామం తాటిపాములలో అభివృద్ధి పనులు జరుగుతున్నంత మాత్రాన అక్కడి నుంచి పోటీ చేస్తానని చెప్పడం అవాస్తవమని స్పష్టం చేశారు.
#UttamKumarReddy #Huzurnagar #HuzurnagarConstituency #TelanganaPolitics #TelanganaElections #Tungaturthi #Delimitation #Congress #Telangana











