Home Political_News హైదరాబాద్‌లో జనసేన కొత్త ఆఫీస్ – నేడు ప్రారంభించనున్న పవన్ కళ్యాణ్

హైదరాబాద్‌లో జనసేన కొత్త ఆఫీస్ – నేడు ప్రారంభించనున్న పవన్ కళ్యాణ్

45

తెలంగాణలో పార్టీ బలోపేతంపై ఫోకస్

హైదరాబాద్ నగరంలో జనసేన తెలంగాణ పార్టీ నూతన కార్యాలయాన్ని ఆ పార్టీ అధ్యక్షుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శుక్రవారం మధ్యాహ్నం 12:00 గంటలకు ప్రారంభించనున్నారు. మల్కం చెరువు సమీపంలో ఏర్పాటు చేసిన ఈ కొత్త కార్యాలయం ద్వారా తెలంగాణలో పార్టీ విస్తరణకు, సంస్థాగత నిర్మాణానికి ఆయన శ్రీకారం చుట్టనున్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరు కావాలంటూ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పార్టీ నాయకులకు, జనసైనికులకు, వీరమహిళలకు ఇప్పటికే అధికారికంగా ఆహ్వానాలు అందాయి. ఈ నూతన కార్యాలయ ప్రారంభోత్సవానికి రాష్ట్రం నలుమూలల నుండి భారీ సంఖ్యలో జనసైనికులు, అభిమానులు తరలివస్తారని పార్టీ ముఖ్య నేతలు అంచనా వేస్తున్నారు. భవిష్యత్తులో తెలంగాణ రాజకీయాల్లో జనసేన చేపట్టబోయే ఉమ్మడి కార్యాచరణకు, ప్రజా పోరాటాలకు ఈ కార్యాలయమే ప్రధాన కేంద్రంగా మారనుంది. కార్యాలయ ప్రారంభం అనంతరం తెలంగాణలో పార్టీ బలోపేతం, కొత్త చేరికలు, కమిటీల నియామకాలపై పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా దృష్టి సారించనున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.