Home AP ప్రకృతి సంరక్షణతోనే అభివృద్ధి

ప్రకృతి సంరక్షణతోనే అభివృద్ధి

వేస్టేజ్‌ నుంచి ఎనర్జీ ఉత్పత్తి చేయాలి.
ది ఎర్త్‌ సెంటర్‌ ప్రారంభోత్సవంలో సీఎం.

బెంగళూరులోని వైట్‌ఫీల్డ్‌లో ది ఎర్త్‌ సెంటర్‌ను కర్ణాటక సీఎం డీకే శివకుమార్‌తో కలిసి ప్రారంభించిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, అభివృద్ధి ప్రకృతికి అనుకూలంగా సాగాల్సిన అవసరాన్ని వివరించారు. కాంక్రీట్‌ జంగిల్స్‌ నుంచి పర్యావరణహిత నిర్మాణాల వైపు మారాలని సూచించారు. గ్రే గ్రోత్‌ నుంచి గ్రీన్‌, సర్క్యులర్‌, రీజెనరేటివ్‌ గ్రోత్‌ వైపు అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. ప్రకృతి, సాంకేతికత, ఆధునిక పని వాతావరణాన్ని కలిపి నిర్మించిన ఎర్త్‌ సెంటర్‌ ఇందుకు ఉదాహరణగా నిలుస్తుందని చెప్పారు. రీసైకిల్‌ పదార్థాల వినియోగం, సుస్థిర నిర్మాణ పద్ధతులకు ప్రాధాన్యం ఇవ్వడం అభినందనీయమన్నారు. అభివృద్ధి ఆగకూడదని.. అదే సమయంలో పర్యావరణానికి గాయం చేయకూడదని స్పష్టం చేశారు.

ప్రతి భవనం ఒక వనరుగా మారాలి

వాతావరణ మార్పుల ప్రభావం భవిష్యత్తు సమస్య కాదని, ఇప్పటికే ఎదుర్కొంటున్న సవాలని చంద్రబాబు అన్నారు. భవనాల్లో నెట్‌జీరో విధానాలు, సోలార్‌ విద్యుత్‌, నీటి సంరక్షణ, వ్యర్థాల పునర్వినియోగాన్ని విస్తృతం చేయాలని సూచించారు. ప్రతి పైకప్పు విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రంగా మారాలని, ప్రతి నీటి చుక్కను తిరిగి వినియోగించాలని, వ్యర్థాలను వనరులుగా మార్చాలని చెప్పారు. వ్యవసాయంలో జీరో బడ్జెట్‌ నేచురల్‌ ఫార్మింగ్‌ తరహాలో పట్టణాభివృద్ధిలోనూ ప్రకృతికి ప్రాధాన్యం ఇవ్వాలని అన్నారు. 2030 నాటికి 500 గిగావాట్ల నాన్‌-ఫాసిల్‌ విద్యుత్‌ సామర్థ్య లక్ష్యంలో ఏపీ కీలక పాత్ర పోషిస్తుందని, రాష్ట్రంలో సుమారు 165 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని ప్రణాళిక చేస్తున్నామని తెలిపారు. అమరావతిని ప్రకృతి, సాంకేతికత, ఆధునిక మౌలిక వసతులతో భవిష్యత్‌ తరాలకు అనువైన నగరంగా తీర్చిదిద్దుతున్నామని చంద్రబాబు పేర్కొన్నారు.

 

#ChandrababuNaidu #TheEarthCentre #GreenGrowth #SustainableDevelopment #WasteToEnergy #EnvironmentalProtection #CircularEconomy #RegenerativeGrowth #GreenBuildings #RenewableEnergy #SolarEnergy #WasteRecycling #ClimateChange #Amaravati #AndhraPradesh