ఏప్రిల్ నాటికి పనులు పూర్తి చేయాల్సిందే.
పాత సవాళ్లు మళ్లీ రావొద్దన్న శ్రీధర్ బాబు.
కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలు-2027ను ఘనంగా నిర్వహించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు. శుక్రవారం అసెంబ్లీ కమిటీ హాల్‌లో జరిగిన కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో పుష్కరాల ఏర్పాట్లపై సమీక్షించారు. గత పుష్కరాల్లో ఎదురైన సమస్యలు పునరావృతం కాకుండా క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసి, భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. వచ్చే ఏప్రిల్ నాటికి పనులన్నీ పూర్తి చేసేలా ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేయాలని స్పష్టం చేశారు. ఘాట్ల నిర్మాణం, దేవాలయాల అభివృద్ధి, రవాణా, మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.
ప్రతి పనికి గడువు.. నాణ్యతే ప్రాధాన్యం
రద్దీ ఎక్కువగా ఉండే టైర్-1 ప్రాంతాల్లో ఆధునిక కమాండ్ కంట్రోల్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు శ్రీధర్‌బాబు తెలిపారు. జిల్లాలవారీగా ప్రత్యేక అధికారులను నియమించామని, ప్రతి పనికి నిర్దిష్ట గడువు విధించాలని సూచించారు. పనుల పురోగతిని పర్యవేక్షించేందుకు ఇంటిగ్రేటెడ్ డ్యాష్‌బోర్డ్‌ను వెంటనే అందుబాటులోకి తేవాలని ఆదేశించారు. ఇంజినీర్ల కొరత లేకుండా ఆర్‌అండ్‌బీ, ఇతర శాఖల నుంచి డిప్యుటేషన్‌పై సిబ్బందిని తీసుకోవాలని చెప్పారు. పుష్కరాల సమయంలో వర్షాల అవకాశాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ముందుగానే చేయాలని సూచించారు. భద్రాచలంలో ఎస్‌టీపీ నిర్మాణానికి తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. నిధుల విషయంలో సీఎం రేవంత్‌రెడ్డి సిద్ధంగా ఉన్నారని, పనుల నాణ్యతలో రాజీపడొద్దని మంత్రి స్పష్టం చేశారు.
#GodavariPushkaralu2027 #GodavariPushkaralu #SridharBabu #Telangana #PushkaraluPreparations #GodavariGhats #Bhadrachalam #TelanganaGovernment #InfrastructureDevelopment #TempleDevelopment #TransportArrangements #CommandControlCentre #IntegratedDashboard #TelanganaTourism #PushkaraluNews











