Home AP ఎల్‌నినోపై రాజకీయాలు వద్దు

ఎల్‌నినోపై రాజకీయాలు వద్దు

రైతుల ప్రయోజనమే లక్ష్యం.
ముందస్తు చర్యలతో నీటి భరోసా.
వైసీపీకి టీడీపీ ఎమ్మెల్సీ హితవు .

ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో సాగు, తాగునీటి పరిస్థితులపై ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రకృతి విపత్తులను రాజకీయ అంశాలుగా మార్చడం సరికాదని అన్నారు. ఎల్‌నినో ప్రభావాన్ని ముందుగానే గుర్తించిన ప్రభుత్వం నెలల ముందే అప్రమత్తమైందని తెలిపారు. పోతిరెడ్డిపాడు ద్వారా గండికోట, కడప ప్రాజెక్టులకు నీరు, హంద్రీ–నీవా ద్వారా మూడు జిల్లాలకు సాగు, తాగునీరు అందించే చర్యలు చేపట్టినట్లు చెప్పారు. పట్టిసీమ, పురుషోత్తపట్నం ద్వారా గోదావరి జలాలను వినియోగించుకున్నామని వివరించారు.

సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యం

ప్రకాశం మెట్ట ప్రాంతాల రైతుల కోసం వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేసి కృష్ణా జలాలు అందించామని భూమిరెడ్డి తెలిపారు. కూటమి ప్రభుత్వం బిందు సేద్యానికి ప్రాధాన్యం ఇస్తూ చిన్న రైతులకు 100 శాతం రాయితీ అందిస్తోందన్నారు. హంద్రీ–నీవా ఆధునికీకరణకు రూ.3,500 కోట్లు కేటాయించి కుప్పం చివరి ఆయకట్టు వరకు నీరు అందించే దిశగా చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. ఎల్‌నినో ప్రభావంతో రైతులపై ఒత్తిడి పెరుగుతున్న సమయంలో ప్రజల్లో భయాందోళనలు సృష్టించకుండా, రైతులకు ఉపయోగపడే సూచనలు ఇవ్వాలని ఆయన కోరారు.

 

#ElNino #AndhraPradesh #APFarmers #BhumireddyRamgopalReddy #TDP #TDPMLC #FarmerWelfare #IrrigationProjects #HandriNeeva #Pothireddypadu #Gandikota #VeligondaProject #Pattiseema #DripIrrigation #APAgriculture