బడుగు వర్గాలు రాజకీయ పావులేనా..?
ఈసారైనా అమీతుమీ తేలేనా?
అధికార పీఠంపై “బీసీ”రియస్.
చిట్టా విప్పుతున్న చిరంజీవులు.
అగ్రవర్ణాల్లో మొదలైంది దిగులు.
56 శాతం బీసీ జనాభా ఉన్న తెలంగాణలో రాజకీయ న్యాయం ఎక్కడ? రాష్ట్రం కోసం మా బిడ్డలు ప్రాణాలు అర్పిస్తే.. అధికారం పంచుకునే వేళ మా బీసీ బిడ్డలు ఎందుకు కనిపించరు? ముదిరాజ్‌లు 26–27 లక్షలు, యాదవులు 25 లక్షలు, గౌడలు 16 లక్షలు, మున్నూరు కాపులు 13 లక్షలకు పైగా, పద్మశాలీలు 13 లక్షలకు పైగా, రజకులు దాదాపు 10 లక్షలు, కుర్మలు లక్షల సంఖ్యలో ఉంటే.. ఇంత జనాభా ఉన్నా రాజకీయ నిర్ణయాధికారం ఎక్కడ? మంత్రి పదవులు ఎక్కడ? ఎమ్మెల్యే సీట్లు ఎక్కడ? ఎమ్మెల్సీ అవకాశాలు ఎక్కడ? నామినేటెడ్ పోస్టులు ఎక్కడ? బడ్జెట్‌లో మా వాటా ఎక్కడ? ఐదుగురు బీసీ మంత్రులతో మొదలైన ప్రాతినిధ్యం నాలుగు.. మూడు.. రెండు అంటూ ఎందుకు కుంచించుకుపోతోంది? ఇదేనా సామాజిక న్యాయం? ఇదేనా తెలంగాణ సాధన ఫలితం? ఖమ్మంలో దశాబ్దాలుగా బీసీలకు ఎందుకు రాజకీయ తలుపులు తెరుచుకోవడం లేదు? ఓటు వేసేటప్పుడు బీసీలు గుర్తొస్తారు.. పదవులు పంచేటప్పుడు ఎందుకు గుర్తురారు? పాలక పక్షానికి ఈ ప్రశ్నలకు సమాధానం ఉందా? ప్రతిపక్షాలు బీసీల తరపున ఎందుకు గట్టిగా నిలబడటం లేదు? జనాభా నిష్పత్తిలో మా వాటా అడిగితే తప్పా? మీ కోటా మాకు ఇవ్వమంటున్నామా? మా హక్కు మాత్రమే అడుగుతున్నాం కదా? బీసీల అస్తిత్వాన్ని గుర్తించని రాజకీయ వ్యవస్థను మేమెందుకు గుర్తించాలి? ఇదే ప్రశ్నను బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం చైర్మన్ టి. చిరంజీవులు నేతృత్వంలో బీసీ సమాజం ఇప్పుడు పాలకులు, ప్రతిపక్షాల ముందుంచుతోంది.
#TelanganaBCs #BCs #BackwardClasses #BCPoliticalRepresentation #BCPoliticalPower #TelanganaPolitics #SocialJustice #BCReservations #BCRights #BCMinisters #BCMLAs #BCMLCs #BCWelfare #TelanganaBCPopulation #PoliticalRepresentation #BCLeadership #BCIntellectualForum #TChiranjeevulu #TelanganaPoliticalNews #TelanganaNews











