Home AP గురువాయూరప్ప సన్నిధిలో పవన్‌

గురువాయూరప్ప సన్నిధిలో పవన్‌

వేకువజామున పవిత్ర నిర్మాల్య సేవ.

కేరళలోని త్రిస్సూర్‌ జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన గురువాయూర్‌ శ్రీ బాలకృష్ణ స్వామివారిని ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు. శనివారం తెల్లవారుజామున 3 గంటలకు ఆలయానికి చేరుకున్న ఆయన.. అత్యంత పవిత్రంగా భావించే నిర్మాల్య దర్శనంలో పాల్గొన్నారు. ముందురోజు స్వామివారికి చేసిన అలంకరణతో జరిగే తొలి దర్శనమే నిర్మాల్య సేవ. సుమారు 30 నిమిషాల పాటు ఈ విశిష్ట సేవలో పాల్గొన్న పవన్‌ కళ్యాణ్‌.. గర్భాలయంలో మూలవిరాట్టుకు నిర్వహించిన ప్రత్యేక కైంకర్యాలను భక్తితో తిలకించారు. ఆలయ అధికారులు ఆయనకు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అనంతరం తైలాభిషేకం, వాకచార్థు, శంఖాభిషేకం సేవల్లో పాల్గొన్నారు. స్వామివారి అలంకరణకు ఉపయోగించిన గంధాన్ని తొలగించి అభ్యంగన స్నానం చేయించే విధానాన్ని ఆలయ అర్చకులు ఆయనకు వివరించారు.

స్వామివారికి పట్టువస్త్రాల సమర్పణ

నిర్మాల్య దర్శనం అనంతరం పవన్‌ కళ్యాణ్‌ స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం ఆలయంలోని వినాయకుడిని దర్శించుకుని సంప్రదాయాన్ని అనుసరిస్తూ గుడి వెనుక భాగంలో సాష్టాంగ నమస్కారం చేశారు. ఆలయ ప్రాంగణంలోని ఆంజనేయస్వామి, అనంత పద్మనాభ స్వామి, భగవతి అమ్మవార్లను కూడా దర్శించుకున్నారు. గురువాయూర్‌ ఆలయ ప్రదక్షిణలో భాగంగా అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మేళ్‌శాంతితో పాటు ప్రధాన అర్చకులు పవన్‌ కళ్యాణ్‌ను ఆశీర్వదించి స్వామివారి కళభం, ప్రసాదాలను అందజేశారు. పవన్‌ కళ్యాణ్‌కు ఆయుర్వేద థెరపీ అందించిన వైద్యులు కూడా ఆయనతో కలిసి గురువాయూర్‌ శ్రీ బాలకృష్ణ స్వామిని దర్శించుకున్నారు.

 

#PawanKalyan #GuruvayurTemple #Guruvayur #GuruvayurSriKrishnaTemple #NirmalyaDarshan #NirmalyaSeva #PawanKalyanGuruvayur #PawanKalyanTempleVisit #PawanKalyanKeralaVisit #KeralaTemples #PawanKalyanDevotionalVisit #TempleVisit #SriKrishna #AyyappaSwamy #AndhraPradesh #DeputyCMPawanKalyan #SpiritualJourney #DevotionalVisit