Home AP టార్గెట్ 372 డీఎస్సీపై జగన్ చాణక్య వ్యూహం

టార్గెట్ 372 డీఎస్సీపై జగన్ చాణక్య వ్యూహం

స్పోర్ట్స్ కోటాపైనే సందేహం.
లోకేశ్ మంత్రి పదవి పైనే గురి.
వాస్తవాల కోసం సీబీఐ విచారణ తప్పనిసరి.
ప్రైవేట్ మెడికల్ కాలేజీల తరహాలో మాస్ వార్నింగ్ .
అధికారంలోకి వస్తే అడ్డదారిలో వచ్చిన వారిపై ఛేజింగ్.
కాక్రోచ్‌ల ఉద్యమమే ఇన్స్పిరేషన్.
రోజుకో ఆధారంతో జగన్ సెన్సేషన్.

ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీలను తీసుకోవాలనుకున్నవారు వెనక్కి వెళ్లినట్టే.. ఇప్పుడు అడ్డదారుల్లో ప్రభుత్వ ఉద్యోగాలు పొందినవారూ వెనక్కి వెళ్లాలి.. లేదంటే అధికారంలోకి వచ్చిన తర్వాత చర్యలు తప్పవు! వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తాజా రాజకీయ హెచ్చరికకు ఇదే అసలు అర్థమంటూ ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. నాడు ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల విషయంలో హెచ్చరికలు.. నేడు డీఎస్సీ–2025లో 372 స్పోర్ట్స్‌ కోటా ఉద్యోగాలపై టార్గెట్‌.. అంశం మారినా జగన్‌ వార్నింగ్‌ స్టైల్‌ మాత్రం మారలేదన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మొత్తం డీఎస్సీని ప్రశ్నించకుండా కేవలం 372నే ఎందుకు పట్టుకున్నారు? సర్టిఫికెట్లు నిజమేనా? పోటీలు జరిగాయా? పార్టిసిపేషన్‌ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు ఎలా వచ్చాయి? ధృవీకరించింది ఎవరు? ప్రశ్నలు పెరుగుతున్న కొద్దీ 372 వ్యవహారం మరింత వేడెక్కుతోంది. నిజంగా అక్రమాలు జరిగితే బాధ్యులు ఎవరైనా వదిలేది లేదన్న సంకేతం.. నిబంధనల ప్రకారం ఉద్యోగాలు పొందిన వారికి భయం అవసరం లేదన్న మరో సందేశం.. రెండింటినీ కలిపి జగన్‌ రాజకీయ వ్యూహాన్ని పదునుపెడుతున్నారనే చర్చ సాగుతోంది. నాడు మెడికల్‌ కాలేజీలు.. నేడు 372 ఉద్యోగాలు.. రేపు అధికారంలోకి వస్తే ఏం జరగబోతోంది? టార్గెట్‌ పెట్టిన జగన్‌ చివరి వరకు వెళ్తారా? 372 వెనుక నిజంగా దాగి ఉన్నది ఏమిటి? అసలు జగన్‌ ఎందుకు ఈ 372నే ఎంచుకున్నారు?

 

#YSJagan #JaganMohanReddy #APDSC #DSC2025 #372Jobs #SportsQuota #SportsQuotaJobs #DSCIrregularities #CBIProbe #NaraLokesh #YSRCP #AndhraPradeshPolitics #GovernmentJobs #APPolitics