ఢిల్లీకి చేరిన బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలు.
రేపు మహిళా కమిషన్, మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు.
అసెంబ్లీ గేటు వద్ద తమను అడ్డుకొని పోలీసులు దురుసుగా, అనుచితంగా వ్యవహరించారని ఆరోపిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఢిల్లీకి చేరుకున్నారు. అసెంబ్లీ సమావేశాలకు వెళ్తున్న సమయంలో తమపై జరిగిన వ్యవహారశైలిపై జాతీయ మహిళా కమిషన్, జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. ముఖ్యంగా మహిళా ఎమ్మెల్యేల పట్ల పోలీసులు అమానుషంగా ప్రవర్తించారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, కోవ లక్ష్మి, సత్యవతి రాథోడ్‌తో పాటు జగదీశ్‌రెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి గురువారం ఢిల్లీ చేరుకున్నారు. శుక్రవారం జాతీయ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌ను, జాతీయ మానవ హక్కుల కమిషన్‌ను కలిసి ఫిర్యాదు చేయనున్నారు. అసెంబ్లీ ఆవరణలో మహిళా ఎమ్మెల్యేలపై జరిగిన దాడి, గేటు వద్ద పోలీసులు అడ్డుకున్న తీరు, తమతో వ్యవహరించిన విధానాన్ని కమిషన్ల దృష్టికి తీసుకెళ్లనున్నారు. ఈ ఫిర్యాదుతో అసెంబ్లీ వద్ద చోటుచేసుకున్న ఘటన రాష్ట్ర రాజకీయాలను దాటి జాతీయ స్థాయిలో చర్చకు తీసుకెళ్లేందుకు బీఆర్ఎస్ వ్యూహం పన్నినట్లు కనిపిస్తోంది.
#BRS #BRSWomenMLAs #SabitaIndraReddy #SunithaLakshmaReddy #KovaLaxmi #SatyavathiRathod #TelanganaAssembly #AssemblyGateIncident #Delhi #NationalCommissionForWomen #NHRC #TelanganaPolitics











