Home National_news టీచర్ల స్కామ్‌తో అట్టుడికిన హర్యానా

టీచర్ల స్కామ్‌తో అట్టుడికిన హర్యానా

సేం సీన్ రీపీట్ అంటూ వైసీపీ హైరానా.
అక్కడి టీచర్స్ స్కామ్‌.. ఇక్కడ డీఎస్సీకి పోలికా?
టీచర్‌ నియామకాలపై మళ్లీ పాత భయమా?
ప్రొ.. రామచంద్రయ్య సమగ్ర విశ్లేషణ?

టీచర్‌ ఉద్యోగం… వేలాది యువత కల… ఒక్కో మార్కు జీవితాన్ని మార్చే నిర్ణయం..! దాదాపు 26 ఏళ్ల క్రితం హర్యానాలో జరిగిన టీచర్‌ నియామక కుంభకోణం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ డీఎస్సీ నియామకాలపై కొత్త ప్రశ్నలను లేవనెత్తుతోంది. అప్పట్లో నియామక విధానంలో మార్పులు, ఇంటర్వ్యూ మార్కుల పెంపు, జాబితాల్లో మార్పులు, అర్హతలపై అవకతవకలు చివరకు సీబీఐ దర్యాప్తుకు దారితీశాయి. కోర్టు విచారణ తర్వాత అప్పటి ముఖ్యమంత్రి ఓం ప్రకాశ్‌ చౌతాలా సహా పలువురికి శిక్షలు పడ్డాయి. ఇప్పుడు ఏపీలో స్పోర్ట్స్‌ కోటా పెంపు, అర్హత పరీక్ష నిబంధనల్లో మార్పులు, అనుమానాస్పద సర్టిఫికెట్లు, ఎంపిక ప్రక్రియపై ఆరోపణలు ఎందుకు తెరపైకి వచ్చాయి? ప్రొఫెసర్‌ సి. రామచంద్రయ్య లేవనెత్తుతున్న ప్రశ్న ఇదే. హర్యానాలో జరిగినదానికి ఏపీలో జరుగుతున్నదానికి నిజంగా సారూప్యత ఉందా? నిబంధనల మార్పుల వెనుక కారణమేంటి? స్పోర్ట్స్‌ కోటాలో వచ్చిన సర్టిఫికెట్లు ఎంతవరకు చెల్లుబాటు? నిజంగా మెరిట్‌ అభ్యర్థులకు అన్యాయం జరిగిందా? ఒకవైపు ఆరోపణలు.. మరోవైపు అధికారుల పరిశీలన..! తుది నిజం బయటపడాలంటే రికార్డులు, సర్టిఫికెట్లు, ఎంపిక జాబితాలు, నిబంధనల మార్పులన్నీ లోతుగా పరిశీలించాల్సిందే. హర్యానా ఒకప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది… ఇప్పుడు ఏపీ డీఎస్సీలోనూ అదే తరహా నీడ కనిపిస్తోందా? అసలు కథ ఏంటి?

 

#HaryanaTeacherScam #APDSC #MegaDSC2025 #DSCRecruitment #SportsQuota #TeacherRecruitment #YSRCP #Ramachandraiah #TETEligibility #SportsCertificates #CertificateVerification #TeacherJobs #APEducation #RecruitmentControversy #AndhraPradesh