Home Telangana స్పీకర్‌‌కు అవమానం బీఆర్ఎస్‌పై సీఎం ఆగ్రహం

స్పీకర్‌‌కు అవమానం బీఆర్ఎస్‌పై సీఎం ఆగ్రహం

తెలంగాణ శాసనసభాపతి గడ్డం ప్రసాద్‌పై అనుచిత వ్యాఖ్యల వివాదం రాజకీయంగా మరింత ముదురుతోంది. ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మరోసారి తీవ్రంగా స్పందించారు. బాధ్యులెవరైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని, కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మంగళవారం అసెంబ్లీ సమావేశాల విరామ సమయంలో సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ను ఆయన చాంబర్‌లో కలిశారు. గత రోజు జరిగిన పరిణామాలపై విచారం వ్యక్తం చేస్తూ, ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటుందని స్పీకర్‌కు భరోసా ఇచ్చారు. స్పీకర్‌ను అవమానించేలా జరిగిన ఘటనను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని స్పష్టం చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకునే విషయంలో వెనక్కి తగ్గేది లేదని తేల్చిచెప్పారు. సోమవారం అసెంబ్లీ ఆవరణలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ తాతా మధు స్పీకర్‌ను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారని కాంగ్రెస్‌ ఆరోపిస్తోంది.

 

#RevanthReddy #GaddamPrasadKumar #TelanganaSpeaker #SpeakerControversy #SpeakerInsultRow #TelanganaAssembly #TattaMadhusudhan #TattaMadhu #BRS #Congress #RevanthReddyWarning #StrictAction #BhattiVikramarka #BRSControversy #AssemblyControversy #TelanganaPolitics #TelanganaGovernment #PoliticalRow #TelanganaNews