Home Telangana రేవంత్ కుట్రే: కేటీఆర్

రేవంత్ కుట్రే: కేటీఆర్

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రజా సమస్యలపై శాంతియుతంగా నిరసన తెలిపేందుకు వెళ్లిన ప్రతిపక్ష సభ్యులపై ఉక్కుపాదం మోపారని మండిపడ్డారు. రాహుల్‌గాంధీ పార్లమెంట్‌లో నిరసన తెలిపిన తరహాలోనే తాము నిరసనకు ప్రయత్నించామని, ఎలాంటి అన్‌పార్లమెంటరీ భాష ఉపయోగించలేదని స్పష్టం చేశారు. సీనియర్ మహిళా నేతలు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిల పట్ల పోలీసుల వ్యవహారశైలిని కేటీఆర్ తీవ్రంగా తప్పుబట్టారు. సునీతా లక్ష్మారెడ్డి చీరను పోలీసులు లాగుతున్న సమయంలో కోవా లక్ష్మి అడ్డుకోకపోతే తీవ్ర ప్రమాదం జరిగేదని ఆరోపించారు. ఈ ఘటనతో సునీతమ్మ కన్నీళ్లు పెట్టుకోవడం చూస్తే ఇది శాసనసభ కాదు, దుశ్శాసన సభలా మారిందని వ్యాఖ్యానించారు. ఈ దాడుల వెనుక ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కుట్ర ఉందని కేటీఆర్ ఆరోపించారు. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్‌ను సభకు దూరం చేసి కాంగ్రెస్, బీజేపీ కలిసి నామమాత్రపు చర్చలతో మ్యాచ్‌ఫిక్సింగ్ రాజకీయాలు చేస్తున్నాయని హరీశ్‌రావు విమర్శించారు. ప్రభుత్వంపై వచ్చిన ఆరోపణలను పోలీసులు పరిశీలిస్తామని డీసీపీ శిల్పవల్లి తెలిపారు.

 

#KTR #RevanthReddy #BRS #BRSProtest #TelanganaAssembly #TelanganaPolitics #KTRNews #RevanthReddyGovernment #PoliceControversy #SabitaIndraReddy #SunithaLakshmaReddy #KovaLakshmi #HarishRao #BRSLeaders #OppositionProtest #TelanganaPolice #Congress #BJP #MatchFixingPolitics #AssemblyControversy #TelanganaNews