Home General ₹13,050 కోట్ల ఇవ్వండి ఎయిరిండియాకు నిధుల కొరత నడపలేక సంస్థ లబోదిబో

₹13,050 కోట్ల ఇవ్వండి ఎయిరిండియాకు నిధుల కొరత నడపలేక సంస్థ లబోదిబో

నష్టాల భారంతో నిధుల వేట.

ఎయిర్ ఇండియా పునరుద్ధరణకు టాటా గ్రూప్ చేస్తున్న ప్రయత్నాలకు భారీ నిధుల అవసరం ఏర్పడింది. నష్టాలు పెరుగుతున్న నేపథ్యంలో సంస్థ తన యజమానులు టాటా సన్స్, సింగపూర్ ఎయిర్‌లైన్స్ నుంచి సుమారు ₹13,050 కోట్ల తాజా ఈక్విటీ నిధులు కోరినట్లు రాయిటర్స్ వెల్లడించింది. 2022లో టాటా గ్రూప్ ఎయిర్ ఇండియాను తిరిగి స్వాధీనం చేసుకున్న తర్వాత ఇంత భారీ మొత్తంలో నిధులు కోరడం ఇదే అతిపెద్ద అభ్యర్థనల్లో ఒకటిగా భావిస్తున్నారు. మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ కలిపి సుమారు ₹20,271 కోట్ల నష్టాన్ని నమోదు చేశాయి. గత ఏడాది నష్టాలతో పోలిస్తే ఇది రెట్టింపు కంటే ఎక్కువ. తాజా నిధులను వీలైనంత త్వరగా సమకూర్చాలని సంస్థ కోరుతున్నట్లు సమాచారం. అయితే మొత్తం మొత్తాన్ని ఒకేసారి కాకుండా దశలవారీగా పెట్టుబడి చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఎయిర్ ఇండియాలో సింగపూర్ ఎయిర్‌లైన్స్‌కు సుమారు 25 శాతం వాటా ఉంది. దీంతో తాజా నిధుల సమీకరణలో ఆ సంస్థ పాత్ర కూడా కీలకంగా మారనుంది.

టర్న్‌అరౌండ్‌కు భారీ ఖర్చులు.. పదేళ్ల సవాల్

ఎయిర్ ఇండియాను లాభాల బాట పట్టించేందుకు టాటా గ్రూప్ భారీ పునరుద్ధరణ కార్యక్రమాన్ని చేపట్టింది. పాత విమానాల ఆధునీకరణ, కొత్త విమానాల నిర్వహణ, సిబ్బంది వ్యవస్థలో మార్పులు, సాంకేతిక మౌలిక వసతుల అభివృద్ధి వంటి అంశాలకు భారీగా ఖర్చు అవుతోంది. మరోవైపు పాకిస్థాన్ గగనతల నిషేధం అంతర్జాతీయ కార్యకలాపాలపై ప్రభావం చూపింది. అంతర్జాతీయ విమాన సర్వీసుల్లో ఏర్పడిన అంతరాయాలు కూడా సంస్థపై ఒత్తిడి పెంచాయి. గత ఏడాది జరిగిన ఘోర విమాన ప్రమాదంలో 260 మంది ప్రాణాలు కోల్పోవడం ఎయిర్ ఇండియాపై మరింత ప్రభావం చూపింది. సంస్థ పునరుద్ధరణ ప్రక్రియకు దాదాపు పదేళ్లు పట్టొచ్చని టాటా సన్స్ చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ గతంలో పేర్కొన్నారు. తాజా నిధుల అభ్యర్థనపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. అయితే రాబోయే సంవత్సరాల్లో కూడా ఎయిర్ ఇండియాకు మరిన్ని మూలధన నిధులు అవసరమయ్యే అవకాశం కనిపిస్తోంది.

 

#AirIndia #AirIndiaFunding #AirIndiaCrisis #TataGroup #TataSons #SingaporeAirlines #AirIndiaLosses #AirIndiaExpress #AirIndiaNews #AviationNews #IndianAviation #AirIndiaTurnaround #TataGroupNews #NChandrasekaran #AirIndiaInvestment #IndiaNews