Home AP సీమ మెచ్చినవారే కింగ్ సీన్ రివర్స్ అయితే షేకింగ్

సీమ మెచ్చినవారే కింగ్ సీన్ రివర్స్ అయితే షేకింగ్

పాలకులను తీర్మానించే రాయలసీమ ఓటర్.
రాబోయే ఎన్నికల్లో డిసైడింగ్ ఫ్యాక్టర్.
గ్రేటర్ రాయలసీమ.. మారితే ఏపీ లెక్కలే మారతాయి.

రాజకీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు.. ఓటరు తీర్పు మారితే అధికార సమీకరణాలే మారిపోతాయి. ఒక ఎన్నికలో అఖండ విజయం సాధించిన పార్టీకి మరో ఎన్నికలో అనూహ్య ఎదురుదెబ్బ తగలొచ్చు. ఏపీలో ఆ మార్పులను అర్థం చేసుకోవాలంటే గ్రేటర్ రాయలసీమను విస్మరించలేం. గోదావరి జిల్లాలు గెలుపు దిశను చూపిస్తే.. రాయలసీమ ఆ గెలుపునకు వేగం ఇచ్చే రాజకీయ శక్తి. 75 అసెంబ్లీ స్థానాలున్న ఈ విస్తారమైన ప్రాంతం 2019లో వైసీపీకి వెన్నెముకగా నిలిచింది. 2024లో అదే నేల టీడీపీ–జనసేన–బీజేపీ కూటమికి భారీ విజయాన్ని అందించింది. ఇప్పుడు 2029 వైపు చూస్తే అసలు ప్రశ్న ఒక్కటే.. 2019 ప్రభంజనం తిరిగి వస్తుందా? 2024 కూటమి ఆధిపత్యం కొనసాగుతుందా? లేక సీమ ఓటరు మరో కొత్త రాజకీయ అధ్యాయాన్ని రాస్తాడా? కర్నూలులో కూటమి ఆధిపత్యం, అనంతపురంలో 14–0 సంచలన ఫలితం, కడపలో జగన్‌కు మిగిలిన బలమైన కోట, చిత్తూరులో చంద్రబాబు ప్రభావం, నెల్లూరు–ప్రకాశంలో మారుతున్న సమీకరణాలు.. ఇవన్నీ కలిపి చూస్తే 2029 రాయలసీమ పోరు సాధారణ ఎన్నికల పోటీ కాదు. ఇది అధికార పనితీరు వర్సెస్ అధికార వ్యతిరేకత.. సంక్షేమం వర్సెస్ అభివృద్ధి.. పాత రాజకీయ కోటలు వర్సెస్ కొత్త సామాజిక సమీకరణాల మహాసంగ్రామం. సీమ ఏ వైపు మొగ్గితే.. ఆ ప్రభావం అమరావతి నుంచి రాష్ట్రం మొత్తం వరకు ప్రతిధ్వనించే అవకాశమే ఎక్కువ. గ్రేటర్ రాయలసీమ తీర్పు ఎలా ఉండబోతుందన్న అంశంపై మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ హుస్సేన్ విశ్లేషణ

 

#GreaterRayalaseema #Rayalaseema #RayalaseemaPolitics #APPolitics #AndhraPradeshPolitics #APElections2029 #2029Elections #RayalaseemaVoters #TDP #YSRCP #JanaSena #BJP #ChandrababuNaidu #YSJagan #Kurnool #Anantapur #Kadapa #Chittoor #Nellore #Prakasam #APPoliticalAnalysis #ElectionAnalysis #AndhraPradeshNews