Home AP బీచ్ సాక్స్ పాలసీ ఒక్క ఏపీలోనే కాదు..

బీచ్ సాక్స్ పాలసీ ఒక్క ఏపీలోనే కాదు..

57

టూరిజం ప్రమోషన్ కోసమే కొత్త నిర్ణయం
ప్రజలకు ఇబ్బంది లేకుండా అమలు చేస్తాం
వైసీపీవి అర్థం లేని ఆరోపణలన్న మంత్రి కొల్లు

రాష్ట్రంలో టూరిజం ప్రమోషన్ కోసమే బీచ్ సాక్స్ పాలసీని ప్రవేశపెడుతున్నామని ఎక్సైజ్, గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. ఈ విధానం ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కొత్తగా ప్రారంభించడం లేదని, ఇతర రాష్ట్రాల్లో కూడా అమలులో ఉందని చెప్పారు. సాధారణ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా దీనిని పూర్తి జాగ్రత్తలతో అమలు చేస్తామని వివరించారు. దీనిని మొదటగా విశాఖపట్నం, బాపట్ల జిల్లాలోని సూర్యలంక బీచ్‌లలో పైలట్ ప్రాజెక్ట్‌గా ప్రయోగాత్మకంగా తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. ఈ బీచ్ షాక్స్‌లలో కేవలం ఆల్కహాల్ మోతాదు చాలా తక్కువగా ఉండే మద్యం మాత్రమే అందుబాటులో ఉంటుందని వివరించారు. అన్ని ప్రభుత్వ శాఖలతో సంప్రదింపులు జరిపి, నిబంధనల ప్రకారమే వీటిని ఏర్పాటు చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. బీచ్ సాక్స్ పాలసీపై వైసీపీ నాయకులు మతిభ్రమించి మాట్లాడుతున్నారని మంత్రి కొల్లు రవీంద్ర తీవ్రంగా మండిపడ్డారు. మచిలీపట్నానికి చెందిన మాజీ మంత్రి పేర్ని నానికి వయస్సు పెరిగింది కానీ కనీస జ్ఞానం పెరగలేదని ఎద్దేవా చేశారు. మంత్రి నారా లోకేశ్ చేసిన వ్యాఖ్యలను పేర్ని నాని కావాలనే వక్రీకరిస్తూ రాజకీయ లబ్ధి కోసం చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.