Home AP రైతుల సమస్యలపై ఫోకస్ సూపర్‌ ఎల్‌నినోపై సర్కార్‌ సమరం

రైతుల సమస్యలపై ఫోకస్ సూపర్‌ ఎల్‌నినోపై సర్కార్‌ సమరం


క్షేత్రాల్లోకి శాస్త్రవేత్తలు:పయ్యావుల

సూపర్‌ ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో ఏర్పడుతున్న వర్షాభావ పరిస్థితులపై ప్రభుత్వం క్షేత్రస్థాయి పరిశీలనకు శ్రీకారం చుట్టింది. వ్యవసాయ శాస్త్రవేత్తల ప్రత్యేక బృందాలతో జిల్లాల వారీగా పరిస్థితిని అధ్యయనం చేయిస్తున్నట్లు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ తెలిపారు. అనంతపురంలో ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి పాలడుగు సత్యనారాయణతో పాటు శాస్త్రవేత్తల బృందం మంత్రిని కలిసింది. దేశవ్యాప్తంగా సూపర్‌ ఎల్‌నినో ప్రభావం తీవ్రంగా ఉందని కేశవ్‌ పేర్కొన్నారు. రాష్ట్రంలో దీని ప్రభావంతో వ్యవసాయం, నీటి లభ్యతపై ఎదురయ్యే ఇబ్బందులను గుర్తించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అనేక జిల్లాల్లో ఇప్పటికే తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఉన్న నేపథ్యంలో రైతు సేవా కేంద్రాల పరిధిలో శాస్త్రవేత్తలు క్షేత్రస్థాయిలో పర్యటించనున్నారు. పంటల పరిస్థితి, రైతులకు ఎదురవుతున్న సమస్యలు, నీటి లభ్యత వంటి అంశాలను పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీ నుంచి సమగ్ర నివేదిక అందిన వెంటనే రైతులకు అవసరమైన చర్యలను యుద్ధప్రాతిపదికన చేపడతామని మంత్రి స్పష్టం చేశారు.

 

#AndhraPradesh #Farmers #SuperElNino #PayyavulaKeshav #Drought #RainfallDeficit #Agriculture #APGovernment #FarmersIssues #AgriculturalScientists #WaterAvailability #APAgriculture #AndhraPradeshNews #ClimateImpact #RuralDevelopment