నెలరోజుల శ్రమకు ప్రశంసలు.
జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీకాకుళం జిల్లా చేనేత దంపతులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై తమ అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నారు. ఎచ్చెర్ల నియోజకవర్గంలోని లావేరు గ్రామం పెద్దవీధికి చెందిన బాసిన నాగేశ్వరరావు, లక్ష్మీ దంపతులు మగ్గంపై చంద్రబాబు ముఖచిత్రాన్ని అద్భుతంగా నేసి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సుమారు నెలరోజుల పాటు శ్రమించి రూపొందించిన ఈ ప్రత్యేక శాలువాపై చంద్రబాబు చిత్రంతో పాటు ఆయన పేరు, స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేల పేర్లను కూడా చేనేత నైపుణ్యంతో అల్లారు. సంప్రదాయ చేనేత కళకు ఆధునిక రూపాన్ని జోడిస్తూ రూపొందించిన ఈ కళాఖండం అందరినీ ఆకట్టుకుంది.
చీరాలలో జరిగిన జాతీయ చేనేత దినోత్సవ కార్యక్రమంలో ఈ ప్రత్యేక శాలువాను ముఖ్యమంత్రి చంద్రబాబుకు అందజేశారు. చేనేత దంపతుల నైపుణ్యాన్ని సీఎం అభినందిస్తూ, వారి కళాత్మక ప్రతిభ రాష్ట్రానికి గర్వకారణమని కొనియాడారు. చేనేత కళను భావితరాలకు అందించే ఇలాంటి కళాకారులను ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తుందని తెలిపారు.
#ChandrababuNaidu #ChandrababuPortrait #Handloom #HandloomWeavers #NationalHandloomDay #Srikakulam #AndhraPradesh #WeaverCouple #HandloomArt #Chirala #Weavers #HandloomIndia











