వినాయక చవితి ఉత్సవాల నేపథ్యంలో హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ కీలక ఆదేశాలు జారీ చేశారు. గణేశ్ విగ్రహాల గరిష్ట ఎత్తు 16 అడుగులకు మాత్రమే పరిమితం చేయాలని విగ్రహ తయారీదారులకు స్పష్టం చేశారు. ప్రశాంతంగా, సురక్షితంగా, పర్యావరణహితంగా ఉత్సవాలు నిర్వహించడమే లక్ష్యమని చెప్పారు. విగ్రహాల తయారీ కేంద్రాల్లో అగ్నిమాపక భద్రత, సురక్షిత విద్యుత్ వైరింగ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. మట్టి విగ్రహాలను ప్రోత్సహించాలని, చిన్న విగ్రహాల ప్రతిష్ఠాపనపై ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. గత ఏడాది హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో దాదాపు 23 వేల గణేశ్ విగ్రహాలు ప్రతిష్ఠించారని, రవాణా సమయంలో నాలుగు ప్రమాదాలు చోటుచేసుకున్నాయని గుర్తు చేశారు.
దూల్పేట్, జల్పల్లి, మైలార్దేవ్పల్లి ప్రాంతాల నుంచి విగ్రహాల రవాణాకు ప్రత్యేక ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు ఏర్పాటు చేయాలని సూచించారు. రద్దీ వేళల్లో భారీ విగ్రహాల రవాణాను నివారించాలని, ముందుగా ట్రాఫిక్ పోలీసుల అనుమతి తీసుకోవాలని ఆదేశించారు. బుకింగ్, రవాణా సమయం, మార్గాల వివరాలను ముందుగానే పోలీసులకు అందించాలని చెప్పారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని సజ్జనార్ హెచ్చరించారు.
#GaneshChaturthi #GaneshIdols #Hyderabad #HyderabadPolice #CPSajjanar #VCSajjanar #GaneshFestival #GaneshChaturthi2026 #16FeetGaneshIdol #IdolHeightLimit #EcoFriendlyGanesh #ClayGaneshIdols #FireSafety #ElectricalSafety #TrafficPolice #Doolpet #Jalpally #Mailardevpally #TelanganaNews #HyderabadNews #FestivalGuidelines











