Home General సేవాదినంగా పుట్టినరోజు. ప్రభుత్వాసుపత్రికి బేబీ బెడ్స్ విరాళం. చంటి పిల్లలకు అండగా హెల్పింగ్ యూత్

సేవాదినంగా పుట్టినరోజు. ప్రభుత్వాసుపత్రికి బేబీ బెడ్స్ విరాళం. చంటి పిల్లలకు అండగా హెల్పింగ్ యూత్



ఏలేశ్వరం పట్టణంలో హెల్పింగ్ యూత్ సభ్యులు మరోసారి తమ సేవాభావాన్ని చాటుకున్నారు. సభ్యుడు మద్దుల స్వరూప్ కుమారుడు రుత్విక్, రాందేవ్ స్వీట్ స్టాల్ అధినేత రామ్‌లాల్ పుట్టినరోజు సందర్భంగా స్థానిక ప్రభుత్వాసుపత్రికి రెండు బీపీ మిషన్లు అందజేశారు. అలాగే 20 మంది చంటి పిల్లలకు బేబీ బెడ్స్, డైపర్లు, రొట్టెలు, పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీహెచ్‌సీ చైర్మన్ వాగు రాజేష్ మాట్లాడుతూ హెల్పింగ్ యూత్ సేవలు ఆదర్శనీయమని ప్రశంసించారు. సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు నిర్వహిస్తున్న సభ్యులను అభినందించారు. ఈ సందర్భంగా హెల్పింగ్ యూత్ సభ్యుడు మద్దుల స్వరూప్ 16వసారి రక్తదానం చేసి మానవత్వాన్ని చాటుకున్నారు. రామలింగేశ్వర మెడికల్ స్టోర్స్ ఆధ్వర్యంలో సుమారు 500 చంటి పిల్లల డైపర్లు ఉచితంగా అందజేశారు. కార్యక్రమంలో ఆసుపత్రి వైద్యులు, గొల్లపూడి త్రిమూర్తులు, ఎస్‌కే అలీషా, కేదారిశెట్టి నాగు, పసుపులేటి శ్రీను, చక్రవర్తి పాల్గొన్నారు.

 

#HelpingYouth #Eleshwaram #SocialService #GovernmentHospital #BabyBeds #MedicalDonation #BloodDonation #CommunityService #Humanity #BirthdayService #APNews #CharityWork #ServiceActivities #TeluguNews #SocialWork