Home Cinema_News త్వరలోనే రాకా షూటింగ్‌లోకి అల్లు అర్జున్ | Allu Arjun

త్వరలోనే రాకా షూటింగ్‌లోకి అల్లు అర్జున్ | Allu Arjun

Allu Arjun

త్వరలోనే రాకా షూటింగ్‌లోకి అల్లు అర్జున్

నా దేశం ( సినిమా) : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్,స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక పాన్`ఇండియా చిత్రం రాకా పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. కొత్త షూటింగ్ షెడ్యూల్‌కు సంబంధించిన ఆసక్తికరమైన వార్త సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. తాజా సమాచారం ప్రకారం, చిత్రబృందం త్వరలో ప్రారంభం కానున్న కొత్త షెడ్యూల్‌లో అల్లు అర్జున్ ఇంట్రడక్షన్ సీన్ చిత్రీకరించనుంది. ఈ సీన్‌ను సినిమాకే హైలైట్‌గా నిలిచేలా అత్యంత భారీ స్థాయిలో ప్లాలాన్ చేసినట్లు తెలుస్తోంది.ఈ ఎపిసోడ్ కోసం ప్రత్యేకంగా భారీ సెట్‌ను నిర్మించినట్లు సమాచారం. అట్లీ మార్క్ స్టైలిష్ విజువల్స్, హై వోల్టేజ్ యాక్షన్‌తో బన్నీ ఎంట్రీ ప్రేక్షకులకు గూస్‌బంప్స్ ఇచ్చేలా ఉండబోతుందనే టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రంలో అల్లు అర్జున్ ఇప్పటివరకు కనిపించని వైల్డ్ అండ్ రగ్గడ్ లుక్లో కనిపించనున్నారని ఇండస్టీ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఇంట్రడక్షన్ సీన్‌లో ఆయన మేకోవర్, బాడీ లాంగ్వేజ్, యాక్షన్ స్టైల్ అభిమానులను ఆశ్చర్యపరిచేలా ఉంటాయని సమాచారం. ’పుష్ప’ తర్వాత మరోసారి పూర్తిగా భిన్నమైన పాత్రలో బన్నీ కనిపించనున్న నేపథ్యంలో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ’రాకా’లో హీరోయిన్‌గా బాలీవుడ్ స్టార్ దీపికా పదుకొణె నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆమెతో పాటు మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ కూడా కీలక పాత్రల్లో కనిపించనున్నారని ప్రచారం జరుగుతోంది. ముగ్గురు స్టార్ హీరోయిన్లు ఒకే సినిమాలో భాగం కావడం ఈ ప్రాజెక్ట్‌కు మరో ప్రత్యేక ఆకర్షణగా మారింది. సినీ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం, ’రాకా’ కథ మాఫియా ప్రపంచం చుట్టూ తిరుగుతుందని తెలుస్తోంది. ఓ శక్తివంతమైన డాన్ జీవితాన్ని కేంద్రంగా చేసుకుని యాక్షన్, ఎమోషన్స్, థ్రిల్లింగ్ మలుపులతో కథ సాగనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అట్లీ తన గత చిత్రాల మాదిరిగానే కమర్షియల్ ఎలిమెంట్స్‌తో పాటు భారీ విజువల్ ట్రీట్‌ను అందించేందుకు సిద్ధమవుతున్నారని సమాచారం. ఈ ప్రతిష్ఠాత్మక చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ అత్యంత భారీ బ్జడెట్‌తో నిర్మిస్తోంది.