న్యూయార్క్ మేయరే ఇన్స్పిరేషన్.
ఆచరణకు వస్తే కొత్త రివల్యూషన్.
యోగి దూకుడుకు పడుతుందా బ్రేక్.
ఎస్పీ మేనిఫెస్టోతో ఉత్తరాది షేక్.
ఉచిత విద్యుత్.. 27 లక్షల ఉద్యోగాలు.. నెలకు రూ.5 వేల భృతి.. 23 పంటలకు చట్టబద్ధమైన మద్దతు ధర! ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో అఖిలేశ్ యాదవ్ హామీల అస్త్రాలను ఒక్కొక్కటిగా బయటకు తీస్తున్నారు. యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా భారీ సంక్షేమ మేనిఫెస్టోతో ఎన్నికల సమరానికి దిగారు. కానీ ఈసారి అఖిలేశ్ వ్యూహం కేవలం ఉచిత పథకాలకే పరిమితం కాలేదు. బీసీలు, దళితులు, మైనారిటీలకు రాజకీయ ప్రాతినిధ్యం.. యువతకు ఉద్యోగాలు.. రైతులకు ఆదాయ భద్రత.. మహిళలకు ఆర్థిక భరోసా! ఇలా ప్రతి వర్గాన్ని టార్గెట్ చేస్తూ పీడీఏ రాజకీయాలకు కొత్త పదును పెడుతున్నారు. న్యూయార్క్ మేయర్ జోహ్రాన్ మమ్దానీ తరహాలో తక్కువ ధరలకు నిత్యావసరాలు అందించే దామ్ బంధో బజార్లు తెస్తామంటున్నారు. లోహియా సోషలిస్టు సిద్ధాంతాలను ఆధునిక రాజకీయాలకు అనుసంధానిస్తున్నారు. రూ.5కే భోజనం నుంచి రూ.50 కోట్ల ప్రభుత్వ కాంట్రాక్టుల్లో దళితులకు 50 శాతం రిజర్వేషన్ల వరకు హామీల వరద పారిస్తున్నారు. మరి ఈ సంక్షేమ రాజకీయాలు యూపీలో పనిచేస్తాయా? అఖిలేశ్ ప్రకటించిన హామీలను ప్రజలు నమ్ముతారా? బీజేపీ తన రాజకీయ వ్యూహాలతో ఈ దాడిని అడ్డుకోగలదా? యోగి కోటను బద్దలు కొట్టేందుకు అఖిలేశ్ సిద్ధం చేసిన అసలు ఎన్నికల స్కెచ్ ఏమిటి? యూపీ తీర్పు దేశ రాజకీయాలకు ఎలాంటి సంకేతం ఇవ్వబోతోంది?
#AkhileshYadav #UPElections #SamajwadiParty #SPManifesto #YogiAdityanath #FreeElectricity #UPJobs #FarmersWelfare #PDAPolitics #UttarPradeshPolitics











