Home AP పార్టీ పేరు కాదు.. రాజకీయ సంస్కృతే ముఖ్యం!

పార్టీ పేరు కాదు.. రాజకీయ సంస్కృతే ముఖ్యం!

జెండా మాది.. ప్రశ్నించే హక్కు మీది!
ఉదయం 11 గంటల 11 నిమిషాలకు.
విజయసాయిరెడ్డి పార్టీ ప్రకటన .

పార్టీ పేరు రేపు ప్రకటిస్తాం.. జెండా చూపిస్తాం.. అజెండా వివరిస్తాం. కానీ రాజకీయాల్లో మార్పు ఒక్కరోజులో రాదు. రాజకీయ సంస్కృతిని మార్చాలన్న ఆలోచనతోనే మా ప్రయాణం మొదలవుతుంది. పార్టీని ప్రారంభించడం మా బాధ్యత అయితే.. అది దారి తప్పకుండా ప్రశ్నించడం ప్రజల హక్కు. మాకు నచ్చని ప్రశ్నలైనా అడగండి.. విమర్శలైనా చేయండి.. ఆధారాలతో నిలదీయండి. నాయకులతో విభేదించే స్వేచ్ఛ, అభ్యర్థుల ఎంపికలో ప్రజల భాగస్వామ్యం, ప్రతి జిల్లాకు సంబంధించిన లెక్కలు, కేటాయింపుల నుంచి క్షేత్రస్థాయి పరిస్థితుల వరకు పారదర్శకత.. ఇవన్నీ మా రాజకీయ విధానంలో భాగం కావాలని భావిస్తున్నాం. అభ్యర్థుల విషయంలో ప్రజాభిప్రాయానికి ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పే బాధ్యత నాయకత్వంపై ఉండాలి. రాజకీయాలను ఒక్కరోజులో మార్చేస్తామని మేం చెప్పడం లేదు. నిజాయితీతో ఒక చిన్న ప్రయత్నం చేస్తున్నాం. మా ప్రయత్నం కూడా సంప్రదాయ రాజకీయాల మాదిరిగా మారకుండా ఉండాలంటే మద్దతుదారులు సైతం ప్రశ్నించాలి. విమర్శకులు ఆధారాలతో ముందుకు రావాలి. జెండా మాది కావచ్చు.. కానీ ప్రశ్నించే హక్కు మాత్రం ప్రజలదే. విజయవాడలో కలుద్దాం.. అంటూ విజయసాయిరెడ్డి తన కొత్త రాజకీయ పార్టీ ఆలోచనలను ప్రజల ముందుంచారు.

 

#VijayasaiReddy #NewPoliticalParty #PartyAnnouncement #AndhraPradeshPolitics #Vijayawada #PoliticalReforms #PoliticalCulture #TransparentPolitics #PublicParticipation #PoliticalAccountability #APPolitics #PoliticalNews