Home General గండికోటపై డ్రోన్ నిఘా

గండికోటపై డ్రోన్ నిఘా

4

వైఎస్సార్ కడప జిల్లాలోని ప్రముఖ పర్యాటక కేంద్రం గండికోటలో భద్రతను మరింత కట్టుదిట్టం చేసేందుకు పోలీసులు డ్రోన్ కెమెరాలతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు ఈ చర్యలు చేపట్టినట్లు జమ్మలమడుగు అర్బన్ సీఐ పి.నరేష్ బాబు తెలిపారు. అసాంఘిక శక్తుల కదలికలను నిరంతరం పర్యవేక్షిస్తూ పర్యాటకుల భద్రతకు ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు. ప్రజలు ట్రాఫిక్ నిబంధనలు పాటించడంతో పాటు అనుమానాస్పద కార్యకలాపాల సమాచారం ఉంటే డయల్-112కు తెలియజేయాలని ఆయన కోరారు.

 

#Gandikota #YSRKadapa #KadapaDistrict #TourismSafety #DroneSurveillance #APPolice #TouristSafety #Jammalamadugu #SPShelkeNachiketVishwanath #PoliceMonitoring #DroneCameras #SecurityMeasures #AndhraPradesh #TourismNews #PublicSafety #TrafficRules #Dial112 #LawAndOrder #TouristDestination #GandikotaFort #AdventureTourism #PoliceAlert #CrimePrevention #SurveillanceSystem #AndhraNews #BreakingNews #LatestNews #VisitorSafety #TourismDevelopment #APTourism