అగార్కర్ ఔట్.. ఓజాకు సెలక్షన్ పగ్గాలు!
బంతితో ప్రత్యర్థులను బోల్తా కొట్టించిన స్పిన్నర్.. ఇప్పుడు తన నిర్ణయాలతో భారత క్రికెట్ భవిష్యత్తును మలచబోతున్నాడా? మైదానంలో వికెట్ల వేట సాగించిన ప్రజ్ఞాన్ ఓజా.. ఇప్పుడు ప్రతిభావంతుల వేటకు నాయకత్వం వహించబోతున్నాడా? టీమిండియా సెలక్షన్ కమిటీలో కీలక మార్పులకు రంగం సిద్ధమైంది! అజిత్ అగార్కర్ నిష్క్రమణతో ఖాళీ అయిన చైర్మన్ కుర్చీపై మాజీ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా కూర్చోనున్నట్లు సమాచారం. తాత్కాలిక బాధ్యతల నుంచి పూర్తిస్థాయి అధికారాల దిశగా ఆయన అడుగులు పడుతున్నాయి. మరోవైపు మాజీ స్పిన్నర్ రమేశ్ పవార్ సెలక్షన్ కమిటీలోకి ప్రవేశించనున్నట్లు తెలుస్తోంది. జూనియర్ జట్టు ఎంపిక బాధ్యతలు దొడ్డ గణేశ్‌కు దక్కే అవకాశాలున్నాయి. న్యూజిలాండ్ పర్యటన సమీపిస్తున్న వేళ ఈ పరిణామాలు భారత క్రికెట్లో ఆసక్తి రేపుతున్నాయి.
#PragyanOjha #AjitAgarkar #BCCI #TeamIndia #CricketNews #IndiaSelectors #RameshPowar #DoddaGanesh #IndianCricket #NewZealandTour











