తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి శనివారం ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. తెలంగాణలో చోటుచేసుకుంటున్న తాజా రాజకీయ పరిణామాలు, ప్రభుత్వ పాలన, పార్టీ అంతర్గత విషయాలపై వీరిద్దరి మధ్య సుదీర్ఘంగా చర్చ జరిగినట్లు సమాచారం. రాష్ట్రంలో పార్టీ బలోపేతం, భవిష్యత్తు కార్యాచరణతో పాటు తెలంగాణలోని తాజా రాజకీయ పరిస్థితులను రాజగోపాల్ రెడ్డి రాహుల్ గాంధీకి కూలంకషంగా వివరించారు. రాబోయే రోజుల్లో పార్టీ పరంగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై రాహుల్ ఆయనకు దిశానిర్దేశం చేశారు. అధిష్టాన పెద్దలతో రాజగోపాల్ రెడ్డి జరిపిన ఈ భేటీ ప్రస్తుతం తెలంగాణ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
రాహుల్ గాంధీతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక భేటీ
ఢిల్లీలో రాహుల్ గాంధీతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భేటీ











