Home AP బియ్యం ధరల గుట్టు.. సర్కారు కనికట్టు

బియ్యం ధరల గుట్టు.. సర్కారు కనికట్టు

చోద్యం చూస్తున్న పాలకులు.
రెచ్చిపోతున్న అక్రమార్కులు .
ప్రభుత్వ నిబంధనలకు పాతర.
కలెక్షన్లతో మిలర్ల జాతర.

ఒకప్పుడు ఉల్లి ధరలే ప్రభుత్వాల పునాదులను కదిలించాయి.. ఇప్పుడు బియ్యం ధరలు సామాన్యుడి బతుకును బుగ్గిపాలు చేస్తున్నాయి! నిన్నటివరకు రూ.1,500కు దొరికిన 25 కిలోల బియ్యం బస్తా నేడు రూ.2,200 నుంచి రూ.2,500కు చేరితే పేద, మధ్యతరగతి కుటుంబాలు ఎలా బతకాలి? కిలో సన్నబియ్యం రూ.85 నుంచి రూ.95 దిశగా దూసుకెళ్తుంటే పాలకుల పర్యవేక్షణ ఏమైంది? దేశవ్యాప్తంగా గోదాముల్లో లక్షల టన్నుల ధాన్యం, బియ్యం నిల్వలున్నా మార్కెట్లో ధరల మంట ఎందుకు చల్లారడం లేదు? ఎగుమతుల ప్రభావమా? అక్రమ నిల్వల ఆటనా? వ్యాపారుల గుత్తాధిపత్యమా? లేక ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యమా? కర్ణాటక, తమిళనాడు, కేరళలోనూ ధరల సెగ కనిపిస్తున్నా.. ఎక్కువగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వినియోగదారుడిపై భారం మరింత తీవ్రంగా ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఒకవైపు ఎల్‌నినో హెచ్చరికలు.. మరోవైపు వరి సాగు తగ్గించాలన్న సూచనలు.. రైతు పొలంలో అనిశ్చితి, వినియోగదారుడి వంటింట్లో ధరల దాడి! జనవరి తర్వాత సరఫరా పరిస్థితి ఎలా ఉండబోతోంది? ప్రభుత్వ నిల్వలు ప్రజలకు ఉపశమనం కలిగిస్తాయా? బియ్యం మార్కెట్‌ను అదుపు చేస్తున్నదెవరు? ధరల పెరుగుదల వెనుక అసలు మాయాజాలం ఏమిటి? సంక్షేమ పథకాల లెక్కలు చెబుతున్న పాలకులకు సామాన్యుడి ఆకలి కనిపించడం లేదా? రైతుకు గిట్టుబాటు ధర, ప్రజలకు అందుబాటు ధర కల్పించాల్సిన బాధ్యత ఎవరిది? బియ్యం పండించే దేశంలోనే బియ్యం కొనలేని దుస్థితి ఎందుకు? ధరల మంట వెనుక దాగిన కారణాలు, ప్రభుత్వాల వైఫల్యాలు, రైతు నుంచి వినియోగదారుడి వరకు సాగుతున్న ధరల దోపిడీపై సమగ్ర పరిశీలన.. !

 

#RicePriceHike, #RicePrices, #AndhraPradesh, #Telangana, #FoodInflation, #EssentialCommodities, #RiceMarket, #RiceMillers, #RiceHoarding, #PaddyFarmers, #ConsumerPrices, #IndiaEconomy