Home AP పాపులేషన్ పల్స్@ 2027

పాపులేషన్ పల్స్@ 2027

జనాభా లెక్కలు.
తేడా వస్తే చుక్కలు.
అనూహ్యంగా పెరిగిన పాపులేషన్ .
కులగణనతో కొత్త ఈక్వేషన్.

ఎవరి జనాభా ఎంత? ఎవరి వాటా ఎంత? దేశంలో సామాజిక న్యాయం అసలు లెక్క తేలబోతోందా? పదిహేనేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత దేశం మరోసారి జనాభా లెక్కల కోసం సిద్ధమవుతోంది. కానీ ఈసారి లెక్కించేది కేవలం మనుషుల సంఖ్య మాత్రమే కాదు.. దేశ సామాజిక స్వరూపాన్ని, కులాల బలాబలాలను, ఆర్థిక అసమానతలను, అభివృద్ధి అవసరాలను కూడా! 2027 జనగణనలో తొలిసారిగా డిజిటల్ విధానంతో పాటు దేశవ్యాప్త కులగణనకు అవకాశం కల్పించడం రాజకీయంగా కొత్త చర్చకు తెరలేపుతోంది. ఏ కులం ఎంత? ఏ వర్గం ఎంత వెనుకబడి ఉంది? రిజర్వేషన్లపై ఎలాంటి ప్రభావం ఉండబోతోంది? సంక్షేమ పథకాల రూపకల్పన మారుతుందా? పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజనలో కొత్త సమీకరణాలు తెరపైకి వస్తాయా? ఇప్పటికే విపక్షాలు కులాల వర్గీకరణ, సమాచార సేకరణ విధానం, వ్యక్తిగత గోప్యతపై ప్రశ్నలు సంధిస్తుంటే.. కేంద్రం సమగ్ర గణాంకాలే లక్ష్యమని చెబుతోంది. జనవరి 25 నుంచి దేశవ్యాప్తంగా ఇంటింటి గణనకు రంగం సిద్ధమవుతోంది. ఈసారి నమోదయ్యే ప్రతి సంఖ్య రేపటి విధానాలకు పునాది కావచ్చు. ఇది కేవలం జనాభా లెక్క కాదు.. దేశ సామాజిక, రాజకీయ భవిష్యత్తును ప్రభావితం చేయగల మహా గణాంక యజ్ఞం!

 

#Census2027 #IndiaCensus #CasteCensus #CasteEnumeration #DigitalCensus #IndianPopulation #SocialJustice #ReservationPolicy #EconomicInequality #WelfareSchemes #Delimitation #IndiaPolitics