Home Sports_News కోహ్లీ మాటలతో వీడ్కోలుకు సిద్ధమైన విలియమ్సన్‌!

కోహ్లీ మాటలతో వీడ్కోలుకు సిద్ధమైన విలియమ్సన్‌!

న్యూజిలాండ్‌ దిగ్గజ బ్యాటర్‌ కేన్‌ విలియమ్సన్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకడంలో టీమిండియా స్టార్‌ విరాట్‌ కోహ్లీ మాటలు కీలక పాత్ర పోషించాయట. 16 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌కు ఈ ఏడాది ముగింపు పలికిన విలియమ్సన్‌.. టెస్టుల్లో 10 వేల పరుగుల మైలురాయికి 485 పరుగుల దూరంలో నిలిచిపోయాడు. కోహ్లీ కూడా టెస్టులకు వీడ్కోలు పలికే సమయానికి ఈ ఘనతకు చేరువలోనే ఉన్నాడు. తన రిటైర్మెంట్‌ నిర్ణయానికి ముందు కోహ్లీతో మాట్లాడిన అనుభవాన్ని విలియమ్సన్‌ ‘బిట్వీన్‌ ది టూ బీర్స్‌’ పోడ్‌కాస్ట్‌లో పంచుకున్నాడు. కెరీర్‌, కెప్టెన్సీ, కుటుంబ బాధ్యతలు, ఆటలో ఎదురైన ఒత్తిళ్ల విషయంలో ఇద్దరి ప్రయాణాలు ఒకేలా సాగాయని చెప్పాడు. కోహ్లీతో సంభాషణ తనను తాను అద్దంలో చూసుకున్నట్లుగా అనిపించిందని, ఆ చర్చ తర్వాతే రిటైర్మెంట్‌కు సమయం ఆసన్నమైందని నిర్ణయించుకున్నానని వెల్లడించాడు. వ్యక్తిగత రికార్డుల కోసం తాను ఎప్పుడూ ఆడలేదని స్పష్టం చేశాడు. 9,515 టెస్టు పరుగులు, 7,256 వన్డే పరుగులు, 2,775 టీ20 పరుగులతో కెరీర్‌ ముగించిన విలియమ్సన్‌.. 10 వేల పరుగుల లక్ష్యం కంటే ఆటపై స్వచ్ఛమైన అభిరుచే తనకు ముఖ్యమని వివరించాడు.

 

#KaneWilliamson #ViratKohli #WilliamsonRetirement #KohliAdvice #NewZealandCricket #TeamIndia #TestCricket #CricketRetirement #BetweenTwoBeers #CricketNews #KaneWilliamsonCareer