Home Telangana పెద్ది సుదర్శన్‌రెడ్డికి అశ్రునివాళులు వేలాదిగా తరలివచ్చిన జనం

పెద్ది సుదర్శన్‌రెడ్డికి అశ్రునివాళులు వేలాదిగా తరలివచ్చిన జనం



తెలంగాణ ఉద్యమ నేత, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పెద్ది సుదర్శన్‌రెడ్డికి రాష్ట్రవ్యాప్తంగా ఘన నివాళులు అర్పించారు. ఆయన భౌతికకాయం నర్సంపేటకు చేరుకోగానే వేలాది మంది అభిమానులు, పార్టీ కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు చివరి చూపు కోసం తరలివచ్చారు. పట్టణమంతా శోకసంద్రంగా మారగా, అంతిమయాత్రలో భారీగా జనం పాల్గొన్నారు. అభిమానుల రద్దీతో ప్రధాన రహదారులపై రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. పలువురు కన్నీటి పర్యంతమై తమ అభిమాన నాయకుడికి తుది వీడ్కోలు పలికారు.

పెద్ది సుదర్శన్‌రెడ్డి మృతిపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉద్యమ సహచరుడిని, ఆప్తమిత్రుడిని కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేస్తూ కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కేటీఆర్ ఆయనను నిబద్ధత కలిగిన ఉద్యమ నాయకుడిగా కొనియాడగా, హరీశ్‌రావు ఉద్యమ సహచరుడిని కోల్పోయానని సంతాపం తెలిపారు. మాజీ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ కూడా పెద్ది సేవలను స్మరించుకుంటూ తెలంగాణ సమాజం గొప్ప ప్రజానాయకుడిని కోల్పోయిందన్నారు. నాయకులు, కార్యకర్తలు, ప్రజలు నివాళులతో నర్సంపేటలో విషాద వాతావరణం నెలకొంది.

 

#PeddiSudarshanReddy #Narsampet #BRS #TelanganaMovement #TelanganaPolitics #FormerMLA #BRSLeader #KCR #KTR #HarishRao #NarsampetNews #TelanganaNews #Funeral #Tribute #Condolences #TelanganaLeader