Home AP ఏం జరుగుతోంది నిన్న బోండా, నేడు అఖిలప్రియ

ఏం జరుగుతోంది నిన్న బోండా, నేడు అఖిలప్రియ


నేతలకు హైకమాండ్ వార్నింగ్.
బోండా వ్యవహారంలో ట్విస్ట్!


తెలుగుదేశం పార్టీ నేతలు ఎవరూ పార్టీ నిర్ణయాలకు విరుద్ధంగా మాట్లాడొద్దని ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. కొంతమంది నేతల వ్యాఖ్యలతో పార్టీ కార్యకర్తలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. అందుకే ప్రతి నాయకుడు పార్టీ లైన్‌కు కట్టుబడి ఉండాలని సూచించారు. పార్టీ గీత దాటి వ్యాఖ్యలు చేసిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కూటమి ధర్మాన్ని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు.

బోండా ఉమా వివరణపై సంతృప్తి

అమరావతిలోని టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో మంత్రి నిమ్మల రామానాయుడు, పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా బోండా ఉమామహేశ్వరరావు ఇచ్చిన వివరణతో పార్టీ అధిష్ఠానం సంతృప్తి చెందినట్లు పల్లా వెల్లడించారు. అయితే ఇది మినహాయింపు కాదని, ఇకపై పార్టీ లైన్‌కు విరుద్ధంగా మాట్లాడే వారిపై చర్యలు తప్పవని స్పష్టం చేశారు. పార్టీ నియమావళిని ప్రతి నాయకుడు గౌరవించాలని సూచించారు.

అఖిల ప్రియకు వార్నింగ్
మరోవైపు ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పల్లా శ్రీనివాస్‌తో సమావేశమయ్యారు. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలు, పార్టీకి అందిన ఫిర్యాదులపై ఆమె నుంచి అధిష్ఠానం వివరణ కోరిన నేపథ్యంలో ఈ భేటీ జరిగింది. అహోబిలం ఆలయంలో తలనీలాల కాంట్రాక్ట్ వ్యవహారంలో ఎమ్మెల్యే జోక్యం చేసుకోవడం వివాదానికి దారితీసిందని, దీనిపై పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు పల్లా తెలిపారు. పార్టీ క్రమశిక్షణకు విరుద్ధంగా వ్యవహరిస్తే ఎవరినీ ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. అలాగే ఈ వ్యవహారంలో అఖిలప్రియ భర్త జోక్యం చేసుకోకుండా చూడాలని పార్టీ అధినేత ఆదేశాలను ఆమెకు వివరించినట్లు సమాచారం.

బోండా విషయంలో ఏం జరిగింది?
పైకి అంతా ప్రశాంతంగా కన్పిస్తున్నా బొండా వ్యవహారంలో సంథింగ్ ఏదో జరుగుతోందన్న చర్చ సాగుతున్నట్టుగా తెలుస్తోంది. పార్టీతో వన్ వే కమ్యూనికేషన్లో ఆయన ఉన్నారన్న ప్రచారం కూడా పార్టీలో ఉంది. దీంతో తనను ఇరుకునపెడితే.. టీడీపీని టార్గెట్ చేయాలని ఆయన ఫిక్స్ అయినట్టుగా ప్రచారం జరుగుతోంది. అందరూ బోండా వైసీపీ వైపు చూస్తున్నారని అనుకుంటే.. ఆయన మాత్రం బీజేపీ వైపు చూస్తున్నారని కూడా బెజవాడ పొలిటికల్ సర్కిల్ లో ప్రచారం జరుగుతోంది. వైసీపీలో చేరితే టార్గెట్ అవుతానన్న ఆలోచన కూడా ఆయన చేసినట్టుగా ప్రచారం ఉంది. అయితే మొత్తం వ్యవహారంపై పార్టీ హైకమాండ్‌కు వివరణ తర్వాత కొంత కాలం ఆయన వేచి చూసే ధోరణి అవలంబించాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.

 

#TDP #ChandrababuNaidu #BondaUma #AkhilaPriya #PallaSrinivasaRao #NimmalaRamaNaidu #AndhraPradesh #AndhraPolitics #TDPHighCommand #APPolitics #CoalitionGovernment #PoliticalNews #DisciplinaryAction #Amaravati #BJP #YSRCP #TeluguDesamParty #APNews #IndianPolitics #BreakingNews