Home General వెలుగులోకి సాధిక్ దురాగతాలు కోచ్‌ వేధింపులు.. బాలుడి కన్నీటి గాథ!

వెలుగులోకి సాధిక్ దురాగతాలు కోచ్‌ వేధింపులు.. బాలుడి కన్నీటి గాథ!

భయంతో బతుకుతున్న పదేళ్ల బాలుడు.

రైఫిల్‌ షూటింగ్‌ నేర్చుకోవాలన్న చిన్నారి కల.. కుటుంబ విషాదంతో కన్నీటి కథగా మారింది. ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య ఘటనలో ప్రాణాలతో బయటపడిన పదేళ్ల రియాన్ష్‌ కార్తికేయరెడ్డి చేసిన ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. తన కుటుంబాన్ని నాశనం చేసి, తనను అనాథగా మార్చారని బాలుడు ఆవేదన వ్యక్తం చేశాడు. చిన్నప్పటి నుంచే రైఫిల్‌ షూటింగ్‌పై ఆసక్తితో సాధిక్‌ఖాన్‌ వద్ద పరిచయం ఏర్పడిందని చెప్పాడు. ఆ పరిచయం తర్వాత తన తల్లికి కూడా సాధిక్‌ దగ్గరయ్యాడని, ఆమెను వేధించినట్లు ఆరోపించాడు.


కాకినాడకు చెందిన ఏఈ నూకరాజు కుటుంబ విషాద ఘటనలో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. కుటుంబాన్ని కోల్పోయిన బాలుడు రియాన్ష్‌ కార్తికేయరెడ్డి తనకు రైఫిల్‌ షూటింగ్‌ అంటే ఎంతో ఇష్టమని, మూడో తరగతి నుంచే శిక్షణ తీసుకుంటున్నానని తెలిపాడు. అదే సమయంలో రైఫిల్‌ షూటింగ్‌ కోచ్‌గా ఉన్న సాధిక్‌ఖాన్‌తో పరిచయం ఏర్పడిందని చెప్పాడు. స్కూల్‌ నుంచి తొలగించిన తర్వాత తన అకాడమీకి రావాలని సాధిక్‌ ఫోన్‌ నంబర్‌ ఇచ్చినట్లు బాలుడు వివరించాడు. ఆ పరిచయం ద్వారా తన తల్లికి కూడా సాధిక్‌ పరిచయమయ్యాడని, తన తల్లిని కొడుతూ వేధించేవాడని ఆరోపించాడు. జరిగిన విషయాలను ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలు ఉంటాయని బెదిరించేవాడని రియాన్ష్‌ ఆవేదన వ్యక్తం చేశాడు.

కుటుంబాన్ని కోల్పోయా.. రక్షణ కావాలి

తన కుటుంబం మొత్తం నాశనమైందని, ఇప్పుడు తాను ఒంటరిగా మిగిలిపోయానని రియాన్ష్‌ కన్నీరుమున్నీరయ్యాడు. తన తండ్రి జగదీశ్‌రెడ్డి మృతిపై కూడా తీవ్ర ఆరోపణలు చేశాడు. ప్రొటీన్‌ షేక్‌లో రసాయనాలు కలిపి తన తండ్రిని హత్య చేశారని బాలుడు ఆరోపించినట్లు వెల్లడైంది. ఈ విషయాన్ని బయటకు చెబితే తనను టెర్రరిస్టులకు అమ్మేస్తానని బెదిరించినట్లు చెప్పాడు. కాకినాడ ఎంపీ ఉదయ్‌ శ్రీనివాస్‌ బాలుడిని కలెక్టర్‌ వద్దకు తీసుకెళ్లి అతడి సమస్యలను వివరించారు. బాలుడి ఆస్తులను అతడి పేరుపైకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని, చదువుతో పాటు పూర్తి రక్షణ కల్పించాలని కలెక్టర్‌ను కోరారు. తనకు బయటకు వెళ్లాలన్నా భయంగా ఉందని రియాన్ష్‌ చెప్పడంతో ఈ ఘటన మరింత కలకలం రేపింది.

కఠిన చర్యలకు ఎంపీ డిమాండ్‌

ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్యకు సాధిక్‌ఖాన్‌ ప్రధాన కారణమని ఎంపీ ఉదయ్‌ శ్రీనివాస్‌ ఆరోపించారు. నూకరాజు కుటుంబ ఆస్తులు, బ్యాంకు ఖాతాలకు సంబంధించిన అంశాల్లోనూ సాధిక్‌పై ఆరోపణలు ఉన్నాయని తెలిపారు. సౌజన్యను వేధించడంతో ఆమె తీవ్ర మానసిక వేదనకు గురైందని పేర్కొన్నారు. ఈ కేసును సీబీఐకి అప్పగించి సమగ్ర దర్యాప్తు చేయాలని డిమాండ్‌ చేశారు. సాధిక్‌ వద్ద శిక్షణ పొందిన ఇతర విద్యార్థులు కూడా ఏవైనా ఇబ్బందులు ఎదుర్కొంటే ముందుకు రావాలని, వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు. బాలుడి భవిష్యత్తు కోసం ప్రభుత్వం అండగా నిలవాలని కోరారు. ఇప్పటికే సాధిక్‌ఖాన్‌ను పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు పంపారు. ఇప్పుడు రియాన్ష్‌ వాంగ్మూలంతో ఈ కేసు మరింత కీలక దశకు చేరింది.

 

#SadiqKhan #SadiqKhanCase #RianshKarthikeyaReddy #Kakinada #AE NUKaraju #FamilyTragedy #ShootingCoach #RifleShooting #ChildProtection #UdaySrinivas #AndhraPradesh #CrimeNews #SadiqKhanArrest #CBIInvestigation #APNews