Home Telangana విలువ తెలిసొస్తోంది కాళేశ్వరం ప్రాజెక్టే సమాధానం: కేటీఆర్

విలువ తెలిసొస్తోంది కాళేశ్వరం ప్రాజెక్టే సమాధానం: కేటీఆర్



ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకం ద్వారా గోదావరి జలాలు ఎదురెక్కడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ చేసిన దుష్ప్రచారానికి కాళేశ్వరం ప్రాజెక్టే సమాధానం చెబుతోందని అన్నారు. రివర్స్ పంపింగ్ ద్వారా శ్రీరాంసాగర్ వరద కాలువలోని రాంపూర్, రాజేశ్వరరావుపేట పంప్‌హౌస్‌ల నుంచి నీటిని ఎత్తిపోస్తూ సుమారు రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందుతోందని పేర్కొన్నారు. తెలంగాణ రైతుకు కాళేశ్వరం ప్రాజెక్టు మరోసారి భరోసాగా నిలిచిందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఎక్స్ వేదికగా స్పందించిన కేటీఆర్, ఎస్సారెస్పీలోకి కాళేశ్వరం జలాలు ఎదురెక్కుతున్న వీడియోను పంచుకున్నారు. కాంగ్రెస్ ఎన్ని విమర్శలు చేసినా, తమ పొలాలకు చేరుతున్న నీటిని చూసే రైతులకు వాస్తవం స్పష్టంగా తెలుస్తుందని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవసరం, ప్రాముఖ్యత కాలమే నిరూపిస్తోందని పేర్కొన్నారు. రైతుల ప్రయోజనాల కోసం నిర్మించిన ఈ ప్రాజెక్టుపై రాజకీయ విమర్శలు చేసినా, సాగునీరు అందుతున్న ప్రతి ఎకరం కాంగ్రెస్ ఆరోపణలను తిప్పికొడుతోందని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

 

#KTR #KaleshwaramProject #Kaleshwaram #SRSP #GodavariWaters #TelanganaIrrigation #TelanganaFarmers #BRS #KTRNews #TelanganaPolitics #ReversePumping #IrrigationProject #SriRamSagarProject #TelanganaNews #GodavariWater