Home Inter National News ఇజ్రాయెల్‌లో హంగు నెతన్యాహు ఖంగు

ఇజ్రాయెల్‌లో హంగు నెతన్యాహు ఖంగు

ఏ పార్టీకి దక్కని మెజారిటీ.
ప్రభుత్వ ఏర్పాటుపై కనిపించని క్లారిటీ.
లికుడ్‌కు బ్యాడ్ లక్.
అధికార పార్టీకి ఓటర్ల చెక్.

ఒకవైపు సుదీర్ఘ రాజకీయ అనుభవం, మరోవైపు మార్పు కోసం ప్రతిపక్షం పోరాటం! మధ్యలో అరబ్‌ ఓట్ల ప్రభావం.. చుట్టూ యుద్ధ భయాలు, ఆర్థిక ఒత్తిళ్లు, అంతర్జాతీయ రాజకీయాలు! ఇజ్రాయెల్‌ ఎన్నికలు ఇప్పుడు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ప్రధానమంత్రి బెంజమిన్‌ నెతన్యాహు నేతృత్వంలోని కూటమి ముందంజలో ఉన్నా.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన 61 స్థానాల మద్దతు లభిస్తుందా? ఇదే అసలు ప్రశ్న! లికుడ్‌ అతిపెద్ద పార్టీగా నిలవడం ఆయనకు ఊరటనిచ్చినా, మెజారిటీ లెక్కలు మాత్రం కొత్త చిక్కులు సృష్టిస్తున్నాయి. మరోవైపు గాది ఐసెన్‌కాట్‌ నేతృత్వంలోని ప్రతిపక్షం అధికార మార్పు కోసం ప్రయత్నిస్తోంది. కానీ పార్టీల మధ్య విభేదాలు, అరబ్‌ పార్టీలతో కలిసి పనిచేయడంపై అభ్యంతరాలు ఆ శిబిరానికి సవాలుగా మారాయి. అమెరికా మద్దతు, ఇరాన్‌తో ఉద్రిక్తతలు, గాజా యుద్ధం.. ఓటర్ల నిర్ణయంపై వీటి ప్రభావం ఎంత? ప్రజల భద్రత, జీవన వ్యయం, ప్రభుత్వంపై విశ్వాసం.. ఎవరి రాజకీయ భవిష్యత్తును నిర్ణయించనున్నాయి? నెతన్యాహు మళ్లీ పగ్గాలు చేపడతారా? ఐసెన్‌కాట్‌కు అవకాశం దక్కుతుందా? లేక కూటముల ప్రతిష్ఠంభన ఇజ్రాయెల్‌ను మరో ఎన్నిక వైపు నడిపిస్తుందా? ఓట్ల లెక్కల నుంచి అధికార పోరు వరకు.. ఇజ్రాయెల్‌ రాజకీయాల్లో అసలు మలుపు ఏమిటి?

 

#IsraelElection #BenjaminNetanyahu #Likud #IsraeliPolitics #GadiEisenkot #CoalitionGovernment #IsraelOpposition #MiddleEastPolitics #GazaWar #IranTensions #ArabVoters #ElectionAnalysis