రాజకీయాలకు దూరంగా విద్య- లోకేశ్.
కాకినాడ రూరల్ తిమ్మాపురం ఆకుండి లక్ష్మీ స్మారక గోశాల ప్రాంగణంలో పాఠశాల విద్యాశాఖ, ప్రభుత్వ నైతిక విలువల సలహాదారు, ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ‘భారతీయం’ కార్యక్రమానికి మంత్రి నారా లోకేశ్ హాజరయ్యారు. విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడిన ఆయన.. క్లాస్‌రూమ్ నుంచే సమాజంలో మార్పు తీసుకురావచ్చని చెప్పారు. అందుకే తాను విద్యాశాఖను ఎంచుకున్నానని తెలిపారు. విద్యా వ్యవస్థ రాజకీయాలకు దూరంగా ఉండాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ కృషికి నైతిక విలువలు జోడిస్తే ఆంధ్రప్రదేశ్ విద్యా వ్యవస్థ దేశంలోనే అగ్రస్థానానికి చేరుతుందని అన్నారు. సాంకేతికతను భారతీయ విలువలతో కలిపి విద్యార్థులను ప్రపంచ విజేతలుగా తీర్చిదిద్దాలని ఆకాంక్షించారు.
దేశభక్తి.. నైతిక విలువలే బలం
దేశభక్తి, నైతిక విలువలు కుటుంబ వ్యవస్థకు పునాదులని లోకేశ్ అన్నారు. ఓర్పు, సహనం, త్యాగ భావనతో విద్యార్థులు ముందుకు సాగాలని సూచించారు. దేశం కోసం ఆలోచించే గుణాన్ని పెంపొందించుకోవాలని, అవసరమైతే త్యాగాలకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. విద్యార్థులు విలువలతో ఎదిగి తల్లిదండ్రులకు, దేశానికి గర్వకారణంగా నిలవాలని మార్గదర్శనం చేశారు. ప్రభుత్వ పాఠశాలలపై సీఎం చంద్రబాబుకు ప్రత్యేక శ్రద్ధ ఉందని గుర్తుచేశారు. బాపట్ల మెగా పేరెంట్-టీచర్ సమావేశంలో విద్యార్థులకు అందించే భోజనం పరిశీలించిన సీఎం.. పరిమాణం పెంచాలని సూచించారని తెలిపారు. విద్యతో జ్ఞానం.. విలువలతో వ్యక్తిత్వం పెంపొందించడమే ‘భారతీయం’ కార్యక్రమం లక్ష్యమని లోకేశ్ పేర్కొన్నారు.
#NaraLokesh #Lokesh #Bharateeyam #Education #APEducation #MoralValues #IndianValues #StudentDevelopment #ChagantiKoteswaraRao #KakinadaRural #GovernmentSchools #Patriotism #EducationReforms #AndhraPradesh #APNews











