సీఎస్కేలో ఇప్పుడు కోచ్ కుర్చీ చుట్టూ ఆసక్తికరమైన పరిణామాలు జరుగుతున్నాయి. ఏళ్లుగా జట్టును విజయాల బాటలో నడిపించిన స్టీఫెన్ ఫ్లెమింగ్ తప్పుకోవడంతో.. తదుపరి కోచ్ ఎవరనే ప్రశ్నకు సమాధానం కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. గత మూడు సీజన్లుగా ప్లేఆఫ్స్‌కు దూరమైన సీఎస్కే.. 2026 సీజన్‌లో ఎనిమిదో స్థానంతో ముగించడం పరిస్థితిని మరింత కీలకంగా మార్చింది. ఈ నేపథ్యంలో కొత్త కోచ్ ఎంపికలో ఎంఎస్ ధోనీ కీలకంగా వ్యవహరిస్తున్నట్టు సమాచారం. భారతీయ కోచ్‌తో పాటు భారతీయ సపోర్ట్ స్టాఫ్ ఉండాలనేది ధోనీ తొలి షరతుగా తెలుస్తోంది. దీంతో మాజీ భారత బ్యాటర్ హేమంగ్ బదానీ పేరు రేసులో ముందుకు వచ్చింది. ఐపీఎల్‌తో పాటు విదేశీ లీగ్‌ల్లో కోచింగ్ అనుభవం ఉన్న బదానీకి సీఎస్కే బాధ్యతలు అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ధోనీ ప్రతిపాదనలో మరో కీలక కండిషన్ కూడా ఉందట. కొత్త హెడ్ కోచ్ పూర్తిగా సీఎస్కేకే అంకితం కావాలి.. ఇతర ఫ్రాంచైజీలకు సమాంతరంగా సేవలు అందించకూడదన్నదే ఆ నిబంధన. గతంలో ఫ్లెమింగ్ పలు విదేశీ లీగ్ జట్ల బాధ్యతలు కూడా నిర్వహించేవాడు. ఆ విధానానికి చెక్ పెట్టి.. సీఎస్కేపైనే పూర్తి ఫోకస్ పెట్టే కోచ్‌ను తీసుకురావాలన్నది ధోనీ ఆలోచనగా తెలుస్తోంది.
#CSK #ChennaiSuperKings #MSDhoni #StephenFleming #CSKCoach #CSKNewCoach #HemangBadani #CSKHeadCoach #IPL #IPL2026 #Dhoni #CSKNews #Cricket











