Home Telangana క్రాస్‌రోడ్స్‌లో కాంగ్రెస్! తెలంగాణ రాజకీయాల్లో రణరంగం!

క్రాస్‌రోడ్స్‌లో కాంగ్రెస్! తెలంగాణ రాజకీయాల్లో రణరంగం!

రాజగోపాల్ వ్యాఖ్యలతో ప్రకంపనలు .
పీక్‌లోకి పొలిటికల్ గేమ్.. కమలం కింకర్తవ్యం.
తగ్గేదేలేదంటున్న రేవంత్.. సైసై అంటున్న బీఆర్ఎస్.

తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా సీన్ మారిపోయింది! అధికార కాంగ్రెస్‌లో అంతా సజావుగానే సాగుతోందనుకున్న వేళ.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విసిరిన రాజకీయ బాంబు గాంధీభవన్‌లో ప్రకంపనలు సృష్టిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి భాష మార్చుకోవాలంటూ రాజన్న చేసిన వ్యాఖ్యలు కేవలం మాటల తూటాలా? లేక కాంగ్రెస్‌లో లోలోపల రగులుతున్న అసంతృప్తికి బహిరంగ రూపమా? కొడంగల్, మధిర మాత్రమే నియోజకవర్గాలు కావన్న వ్యాఖ్య వెనుక ఎవరికి తెలియని రాజకీయ ఆవేదన దాగి ఉందా? ఇప్పుడు రాజగోపాల్ రెడ్డిపై చర్యలు తీసుకుంటే అసమ్మతి మరింత రాజుకుంటుందా? తీసుకోకపోతే సీఎం నాయకత్వానికి సవాలుగా మారుతుందా? ఇదే అదనుగా బీఆర్ఎస్ రంగంలోకి దిగింది. హరీశ్ రావు సిద్దిపేటలో పోటీ చేయ్ రా, అసెంబ్లీ సమావేశాలు పెట్టు చూసుకుందాం అంటూ నేరుగా రేవంత్‌కు సవాళ్లు విసురుతుంటే.. కాంగ్రెస్ కరువంటూ కేటీఆర్ దూకుడు ప్రదర్శిస్తున్నారు. మళ్లీ కేసీఆర్ సీఎం అవుతారని, రెండేళ్లలో మళ్లీ అధికారం మాదేనంటూ గులాబీ దళం గర్జిస్తోంది. మరోవైపు కాంగ్రెస్‌లో అసంతృప్తుల అడుగుల కోసం కమలనాథులు ఎదురుచూస్తున్నారా? రేవంత్ వర్సెస్ రాజగోపాల్.. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్.. మధ్యలో బీజేపీ వ్యూహం! ఇది మాటల యుద్ధమేనా? రాబోయే ఎన్నికలకు ముందస్తు రాజకీయ సంగ్రామమా? తెలంగాణ రాజకీయ చదరంగంలో అసలు పావులు కదుపుతున్నదెవరు? తెర వెనుక జరుగుతున్న అసలు కథ ఏమిటి? తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఎవరి ఆట వారిదే.. అంతిమ పోరుకు రంగం సిద్ధమవుతోందా

 

#TelanganaPolitics #Congress #RajGopalReddy #RevanthReddy #BRS #KTR #HarishRao #KCR #TelanganaBJP