ఇదేమైనా భారీ బడ్జెట్ చిత్రమా..?
ఏపీ ప్రభుత్వ తీరుపై విమర్శలు.
భారీ బడ్జెట్ సినిమాలకే పరిమితమవ్వాల్సిన టికెట్ ధరల పెంపు వెసులుబాటు.. ఇప్పుడు కుటుంబ కథా చిత్రాలకూ వర్తిస్తోందా? వెంకటేశ్ నటించిన ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం.47’కు పది రోజుల పాటు అదనపు ధరలకు ఏపీ ప్రభుత్వం అనుమతివ్వడం కొత్త వివాదానికి తెరతీసింది. మల్టీప్లెక్స్‌లో రూ.75, సింగిల్ స్క్రీన్‌లో రూ.50 అదనపు భారం.. నలుగురు సభ్యుల కుటుంబానికి వినోదమే ఖరీదైన వ్యవహారంగా మారదా? భారీ బడ్జెట్ చిత్రాలకే ప్రత్యేక వెసులుబాటు అన్న నిబంధనల మాటేమిటి? ‘ఇరుముడి’, ‘రణబాలి’ వంటి చిత్రాలు ధరల పెంపు లేకుండానే ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పుడు, ఈ సినిమాకు మినహాయింపు ఎందుకు? నిర్మాతల వ్యాపార నిర్ణయాలకు ప్రేక్షకులే మూల్యం చెల్లించాలా? సినిమా పరిశ్రమకు సహకరించడం ప్రభుత్వ బాధ్యతే.. కానీ సామాన్య కుటుంబాల జేబులకూ విలువ ఇవ్వాలి కదా! అసలు టికెట్ ధరల పెంపునకు ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రమాణాలేమిటి? ‘ఆదర్శ పెంపు’ ఇదేనా బాబుగారూ.. లేక ఇదేమైనా భారీ బడ్జెట్ చిత్రమా?
#AdarshaKutumbam #Venkatesh #TicketPriceHike #APGovernment #AndhraPradesh #TeluguCinema #TollywoodNews #MovieTicketPrices #CinemaNews #FilmIndustry #TeluguMovies #EntertainmentNews











