Home AP బీసీలే జగన్‌కు బ్యాక్‌బోన్ క్లాసెస్

బీసీలే జగన్‌కు బ్యాక్‌బోన్ క్లాసెస్

వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ టీడీపీపై విమర్శలు చేశారు. విశాఖపట్నంలో నిర్వహించిన వైఎస్సార్‌సీపీ బీసీల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వైఎస్ జగన్ దృష్టిలో బీసీలు అంటే ‘బ్యాక్‌బోన్ క్లాసెస్’ అని పేర్కొన్నారు. బీసీల సంక్షేమం, రాజకీయ ప్రాధాన్యత విషయంలో చంద్రబాబు పాలనకు, జగన్ పాలనకు స్పష్టమైన తేడా ఉందని బొత్స అన్నారు. జగన్ పాలనలో బీసీలు సమాజంలో తలెత్తుకుని నిలబడేలా చర్యలు తీసుకున్నారని చెప్పారు. బీసీలకు రాజ్యసభ, ఎమ్మెల్సీ పదవులు కల్పించడంతో పాటు పార్టీ కమిటీల్లోనూ ప్రాధాన్యత ఇచ్చారని వివరించారు. టీడీపీ ప్రభుత్వం బీసీలకు చేసిందేమిటో ఆ పార్టీ నేతలు చెప్పాలని ప్రశ్నించారు. బీసీలకు సంబంధించిన అంశాలపై టీడీపీ నాయకులు ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు. పుట్టిన ప్రాంతం, సామాజిక వర్గానికి న్యాయం జరిగేలా తమ పార్టీ నేతలు మాట్లాడాలని ఆయన సూచించారు. ప్రచార ఆర్భాటం కాకుండా బీసీలకు వాస్తవంగా జరిగిన మేలు ఏమిటో ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందని బొత్స వ్యాఖ్యానించారు.

 

#BotsaSatyanarayana #YSJagan #BackboneClasses #BCWelfare #YSRCP #TDP #AndhraPradeshPolitics #BCCommunity #PoliticalRepresentation #AndhraPolitics #APNews