Home AP వేగంగా పోలవరం నిధుల విడుదల ముఖ్యం

వేగంగా పోలవరం నిధుల విడుదల ముఖ్యం

పాటిల్‌తో చంద్రబాబు భేటీ.

ఢిల్లీ పర్యటనలో సీఎం చంద్రబాబు నాయుడు కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్‌ పాటిల్‌తో భేటీ అయ్యారు. పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిని వివరించారు. పనులు వేగంగా సాగుతున్నాయని, వచ్చే గోదావరి పుష్కరాల నాటికి ప్రాజెక్టును పూర్తిచేసి జాతికి అంకితం చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని తెలిపారు. రూ.30 వేల కోట్లతో చేపట్టిన జల్‌ జీవన్‌ మిషన్, అమరజీవి జలధార పనుల వివరాలను కూడా కేంద్ర మంత్రికి వివరించారు. ఈ రెండు పథకాలకు అవసరమైన నిధులను సకాలంలో విడుదల చేయాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.

ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌తో సమన్వయం

పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌తో ముడిపడిన దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని సీఎం కోరారు. రక్షణ కరకట్టల నిర్మాణానికి సంబంధించిన ప్రజాభిప్రాయ సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. ప్రస్తుతం నిలిపివేత ఉత్తర్వు అమలులో లేకపోయినా, దానిని శాశ్వతంగా ఉపసంహరించాలని విజ్ఞప్తి చేశారు. మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో జలశక్తి శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించాలని ప్రతిపాదించారు. సహకారం, సమన్వయం, పరస్పర అవగాహనతో సమస్యకు పరిష్కారం కనుగొనవచ్చని చంద్రబాబు పేర్కొన్నారు.

 

#ChandrababuNaidu #PolavaramProject #CRPatil #PolavaramFunds #JalShakti #GodavariPushkaralu #JalJeevanMission #AndhraPradesh #IrrigationProjects #Odisha #Chhattisgarh #APNews