Home Telangana 20 వేల విగ్రహాలు.. ప్రశాంతంగా నిమజ్జనం!

20 వేల విగ్రహాలు.. ప్రశాంతంగా నిమజ్జనం!

24 గంటలపాటు పోలీసుల పహారా.
పోలీసులతో కలిసి సీపీ సజ్జనార్ సంబరాలు.

హైదరాబాద్‌లో వినాయక నిమజ్జన వేడుకలు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా ప్రశాంతంగా ముగిశాయి. హుస్సేన్‌సాగర్‌లో నగరం, మల్కాజ్‌గిరి, ఫ్యూచర్‌ సిటీ పరిధుల నుంచి వచ్చిన 20 వేలకు పైగా భారీ వినాయక విగ్రహాలను నిమజ్జనం చేసినట్లు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ తెలిపారు. 69 అడుగుల భారీ వినాయకుడి నిమజ్జనంతో ప్రారంభమైన ప్రధాన ఊరేగింపులో బాలాపూర్ గణేశుడి విగ్రహం కూడా పాల్గొంది. దాదాపు 24 గంటల పాటు పోలీసులు నిరంతరం విధుల్లో ఉండి ఊరేగింపులు సజావుగా సాగేలా చర్యలు తీసుకున్నారు. నిమజ్జన మార్గాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ట్రాఫిక్‌ నియంత్రణ చేపట్టారు. ఒక్క అవాంఛనీయ ఘటన కూడా చోటుచేసుకోకుండా వేడుకలు పూర్తవడం పోలీసు యంత్రాంగానికి పెద్ద ఊరటగా మారింది. తెలంగాణ ప్రభుత్వం, డీజీపీ, ఇతర శాఖలు అందించిన సహకారానికి సీపీ సజ్జనార్‌ కృతజ్ఞతలు తెలిపారు.

డ్యూటీ ముగిసింది.. పోలీసుల సంబరం
నిమజ్జన కార్యక్రమం పూర్తయిన తర్వాత పోలీసు సిబ్బందితో కలిసి సీపీ సజ్జనార్ “ఆయా షేర్” పాటకు ఉత్సాహంగా డ్యాన్స్‌ చేసి సంబరాల్లో పాల్గొన్నారు. విధుల్లో గంటల తరబడి శ్రమించిన సిబ్బందితో కలిసి ఆయన ఆనందాన్ని పంచుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నగరంలో ప్రధాన నిమజ్జన ప్రక్రియ దాదాపు పూర్తికావడంతో ట్రాఫిక్‌ పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకున్నాయని సీపీ తెలిపారు. ఇంకా కొన్ని విగ్రహాలు మాత్రమే నిమజ్జనం కావాల్సి ఉందన్నారు. సెప్టెంబర్‌ 14న ప్రారంభమైన పది రోజుల గణేశ్‌ ఉత్సవాలు నిమజ్జనంతో ముగిశాయి. ఇళ్లలో ప్రతిష్ఠించిన చిన్న విగ్రహాలతో పాటు ఐదు అడుగులకు పైబడిన భారీ విగ్రహాలు పెద్ద సంఖ్యలో నిమజ్జనం అయ్యాయి. శాంతియుతంగా ఉత్సవాలు ముగియడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.

 

#HyderabadGaneshImmersion #GaneshImmersion #GaneshNimajjanam #HussainSagar #GaneshFestival #HyderabadGanesh #VCSajjanar #HyderabadPolice #GaneshProcession #BalapurGanesh #69FeetGanesh #PoliceSecurity #HyderabadTraffic #GaneshUtsav #TelanganaNews