Home AP కబ్జా కోరల్లో చీరాల తీరం

కబ్జా కోరల్లో చీరాల తీరం

భూబకాసురుల చేతిలో విలవిల .
ఆమంచి ఆరోపణలు.. ప్రభుత్వ పెద్దల మౌనం.
సముద్ర సరిహద్దు భూములు దోచేస్తున్నారా?

చీరాల తీరంలో భూముల కథ ఇప్పుడు మామూలు వివాదం కాదు.. వందల కోట్ల విలువైన భూములు, ప్రభుత్వ రికార్డులు, అనుమతులు, అక్రమ లేఔట్లు, కోస్టల్ రెగ్యులేషన్ జోన్ (సీఆర్‌జడ్) నిబంధనలు ఒకేసారి తెరపైకి వచ్చాయి. మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ చేసిన సంచలన ఆరోపణలతో చీరాల భూవ్యవహారం ఒక్కసారిగా హాట్‌ టాపిక్‌గా మారింది. రామాపురంలో సుమారు 26 ఎకరాల ప్రభుత్వ భూముల రికార్డులు తారుమారయ్యాయని ఆయన ఆరోపిస్తున్నారు. మరోవైపు కొత్తపేట, అక్కాయపాలెం, ఈపురుపాలెం, నాయినిపల్లి ప్రాంతాల్లో 398.04 ఎకరాల అనధికార లేఔట్లను ఫిర్యాదులో ప్రస్తావించారు. మీడియా ముందు మాత్రం దాదాపు 1,200 ఎకరాల లేఔట్లపై ఆరోపణలు గుప్పించారు. ఇంతకీ ఆమంచి ఆరోపణలు 398 ఎకరాలకా..? లేదంటే 1200 ఎకరాలాకా..? అసలు ఎన్ని భూములు వివాదంలో ఉన్నాయి..? కోస్టల్ రెగ్యులేషన్ జోన్ సముద్రానికి దగ్గరగా ఉన్న భూమిలో ఎక్కడైనా ఇష్టం వచ్చినట్లు ఇల్లు, రిసార్ట్, వెంచర్ లేదా ఇతర నిర్మాణాలు చేపట్టకుండా నియంత్రించే చట్టపరమైన వ్యవస్థ ఇప్పుడు నిద్రపోతుందా? సీఆర్‌జడ్ పరిధిలోని భూముల్లో ఏం జరుగుతోంది..? ఎల్ఆర్ఎస్ పేరుతో పాత లేఔట్లకు కొత్త రూపం వచ్చిందా..? అధికారుల పర్యవేక్షణ ఎక్కడ ఆగిపోయింది..? ఆరోపణలు నిజమైతే ఎవరి బాధ్యత..? ఆధారాలు బయటకు వస్తే చీరాల భూచిత్రమే మారుతుందా..? ఆమంచి ఆరోపణల వెనుక ఉన్న డాక్యుమెంట్స్ ఏం చెబుతున్నాయి..? అసలు గుట్టు ఎక్కడుంది..?

#Chirala #ChiralaLandRow #AmanchiKrishnaMohan #CoastalLands #LandEncroachment #GovernmentLand #Ramapuram #UnauthorizedLayouts #CRZ #CRZRules #LRS #AndhraPradesh #LandDispute #CoastalRegulationZone #APNews