ఎనిమిదేళ్ల విరామం తర్వాత తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో యూనియన్ ఎన్నికలు జరగనున్నాయి. అక్టోబర్ 9న ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు షెడ్యూల్ ప్రకటించారు. ఎన్నికల ప్రక్రియలో తొలి దశగా పోటీ చేయాలనుకునే యూనియన్లు సెప్టెంబర్ 21న తమ సమ్మతిని తెలియజేయాల్సి ఉంటుంది. చివరిసారిగా 2016 జూలై 19న యూనియన్ల సభ్యత్వ ధ్రువీకరణ జరిగింది. నిబంధనల ప్రకారం తెలంగాణ మజ్దూర్ యూనియన్‌కు గుర్తింపు లభించింది. తాజా ఎన్నికల ప్రక్రియలో భాగంగా హైదరాబాద్ జాయింట్ కమిషనర్ ఆఫ్ లేబర్ రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తున్నారు. పోటీ చేసే 46 కార్మిక సంఘాలకు తొలి నోటీసులు జారీ చేశారు. యూనియన్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, నిబంధనలు, అనుబంధ గుర్తింపు పత్రం, కోడ్ ఆఫ్ డిసిప్లిన్‌ను అంగీకరించిన హామీ, సభ్యత్వ రుసుము చెల్లించిన వారి జాబితా, ఆడిట్ చేసిన వార్షిక నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. ఎన్నికల అనంతరం అక్టోబర్ 17న ఫలితాలను ప్రకటించనున్నారు. దీంతో ఆర్టీసీ కార్మిక సంఘాల్లో ఎన్నికల సందడి మొదలుకానుంది.
#TSRTC #RTCElections #RTCUnionElections #TelanganaRTC #RTCEmployees #RTCWorkers #UnionElections #LabourUnions #TSRTCElections2026 #October9 #TelanganaMazdoorUnion #LabourDepartment #Hyderabad #ElectionSchedule #RTCNews











