నెల రోజుల్లో లెక్క తేలుతుందా?
ఎర్రవల్లి కథ ఎటు తిరుగుతుందో!?
కాంగ్రెస్ విప్పబోయే గుట్టేంటి?
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి భూముల లెక్క తెరపైకి వచ్చింది. ఈసారి నేరుగా మాజీ సీఎం కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్‌హౌస్ చుట్టూ ఉన్న భూములపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. 700 ఎకరాల విస్తీర్ణం… అందులో 388 ఎకరాలు ప్రభుత్వ భూములేనన్న ఆరోపణలు… 30 రోజుల్లో పూర్తి నివేదిక ఇవ్వాలన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలను వేడెక్కిస్తున్నాయి. ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురయ్యాయా? రికార్డుల్లో మార్పులు జరిగాయా? ధరణి సమయంలో భూముల హక్కులు ఎలా మారాయి? నిజంగా ప్రభుత్వ భూమి ఉంటే దాన్ని తిరిగి స్వాధీనం చేసుకొని దళితులకు పంచుతారా? ఇవన్నీ ఇప్పుడు ఎదురవుతున్న ప్రశ్నలు. అంతకంటే కీలకమైన ప్రశ్న మరోటి. ఈ విచారణ కూడా గతంలో జరిగిన విచారణల మాదిరిగానే మొదలై… కొంతకాలానికి చప్పుడు లేకుండా ఆగిపోతుందా? కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్, గొర్రెల వ్యవహారం, లిక్కర్ ఆరోపణలు, ధరణి వివాదాలపై జరిగిన పరిణామాలను గుర్తుచేసుకుంటూ ప్రజలు ఇప్పుడు ఈ విచారణ ఫలితాన్ని గమనిస్తున్నారు. రేవంత్ ఇప్పటికే ఇది కేవలం పార్ట్-ఏ మాత్రమేనని.. పార్ట్-బీ కూడా ఉందని సంకేతం ఇచ్చారు. అంటే ఎర్రవల్లి దాటి గత పాలనలోని మరిన్ని భూ లావాదేవీలు వెలుగులోకి వస్తాయా? నెల రోజుల్లో రెవెన్యూ అధికారులు ఏం తేలుస్తారు? ఫామ్‌హౌస్ వరకు వెళ్లి సర్వే చేస్తారా? ప్రభుత్వ భూమి ఉంటే చర్యలు తీసుకుంటారా? ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో అసలు ఉత్కంఠ ఇదే!
#KCR #RevanthReddy #Erravelli #KCRFarmhouse #KCRLandProbe #ErravelliLand #TelanganaPolitics #700Acres #388Acres #GovernmentLand #LandRecords #Dharani #KCRFamily #BRSPolitics #TelanganaNews











