ఆశీర్వాద దీపం వెలిగించిన మంత్రి.
ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ఉండవల్లి నివాసంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. మోదీ దేశాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్నారని పేర్కొంటూ ఆయన జన్మదిన సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు చేశారు. భారత్‌ను అభివృద్ధిలో ప్రపంచంలోనే నంబర్‌వన్‌గా నిలిపే శక్తి, సామర్థ్యం ప్రధాని మోదీకి దేవుడు ప్రసాదించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ‘ఆశీర్వాద్ కా దియా’ పేరుతో ఆశీర్వాద దీపాన్ని వెలిగించారు. మోదీకి దేశ ప్రజల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని లోకేశ్ కోరుకున్నారు. ప్రధాని మోదీ వందేళ్లు సంపూర్ణ ఆరోగ్యంతో వర్థిల్లాలని నారా లోకేశ్ ఆకాంక్షించారు. దేశ అభివృద్ధికి మోదీ మరింతకాలం సేవలందించాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేత, ఎమ్మెల్సీ సోము వీర్రాజు పాల్గొన్నారు.
#NaraLokesh #NarendraModi #PMModi #ModiBirthday #AashirwadKaDiya #ModiBirthdayCelebrations #NaraLokeshModi #SomuVeerraju #IndiaDevelopment #AndhraPradesh #TDP #BJP #TDPBJPAlliance #APPolitics











