వ్యవస్థలను మెరుగుదలకు ఎన్నో అవకాశాలు.
కొచ్చిలో జరిగిన ఇండియా టుడే సౌత్ కాన్‌క్లేవ్‌లో ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ పలు కీలక అంశాలపై మాట్లాడారు. రాజ్‌దీప్ సర్దేశాయ్‌తో జరిగిన ప్రత్యేక ఇంటర్వ్యూలో భారత్, ఆంధ్రప్రదేశ్, రాజకీయాలు, పాలన, భవిష్యత్ దిశపై తన అభిప్రాయాలను వెల్లడించారు. ఎన్నికల సంఘం పనితీరుపై వస్తున్న విమర్శలను ప్రస్తావిస్తూ, “వ్యవస్థ పూర్తిగా పరిపూర్ణంగా ఉందా? అసలు కాదు” అని పేర్కొన్నారు. అయితే ఏ వ్యవస్థలోనైనా మెరుగుదలకు అవకాశాలు ఉంటాయని చెప్పారు. ఎన్నికల్లో గెలిచినప్పుడు వ్యవస్థను ప్రశంసించి, ఓడినప్పుడు ఎన్నికల సంఘాన్ని తప్పుపట్టే రాజకీయ ధోరణిపై లోకేశ్ ప్రశ్నలు లేవనెత్తారు. క్షేత్రస్థాయిలో బూత్ నిర్వహణకు రాజకీయ పార్టీలు ముందస్తు సన్నద్ధతతో ఉండాలని సూచించారు.
ఎన్డీఏలో సొంత అభిప్రాయాలకు ప్రాధాన్యం
తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నప్పటికీ, తన స్వతంత్ర రాజకీయ స్వరాన్ని కొనసాగిస్తోందని లోకేశ్ స్పష్టం చేశారు. వక్ఫ్ బిల్లుతో సహా కొన్ని అంశాలపై పార్టీకి భిన్నమైన అభిప్రాయాలు ఉంటే వాటిని కూటమి అంతర్గతంగా చర్చిస్తామని తెలిపారు. యువతలో పెరుగుతున్న మార్పు ఆకాంక్షలపై కూడా ఆయన స్పందించారు. పరిపాలనా సంస్కరణలు, మెరుగైన పాలన, ప్రజలకు ఉపయోగపడే పరిష్కారాల కోసం యువతలో రాజకీయాలకు అతీతంగా ఒక చైతన్యం ఏర్పడుతోందని పేర్కొన్నారు.
#NaraLokesh #ElectionCommission #ECI #IndiaTodayConclave #SouthConclave #TDP #TeluguDesamParty #NDA #SIR #ElectoralReforms #ElectionCommissionIndia #WaqfBill #PoliticalReforms #YouthPolitics #AndhraPradeshPolitics











