Home Telangana వారసత్వ పరిరక్షణకు సహకారం

వారసత్వ పరిరక్షణకు సహకారం

అగాఖాన్‌ ఫౌండేషన్‌పై అత్యంత గౌరవం.
ప్రిన్స్ రహీమ్ అగా ఖాన్-Vతో సీఎం భేటీ.

తాజ్‌ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ప్రిన్స్‌ రహీమ్‌ అగా ఖాన్‌-Vతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమావేశమయ్యారు. తెలంగాణ వారసత్వ సంపద పరిరక్షణలో అగా ఖాన్‌ ఫౌండేషన్‌ కీలక పాత్ర పోషిస్తోందని సీఎం ప్రశంసించారు. ఫౌండేషన్‌ సహకారంతో శాసనమండలి భవనాన్ని పునరుద్ధరించామని, కుతుబ్‌షాహీ సమాధుల పునరుద్ధరణలోనూ సంస్థ విశేష కృషి చేసిందని తెలిపారు. మూసీ నది పునరుజ్జీవానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోందని చెప్పారు. మూసీ పరివాహక ప్రాంతంలోని సిటీ కాలేజ్‌, ఉస్మానియా ఆసుపత్రి భవనాల పునరుద్ధరణకు అగా ఖాన్‌ ఫౌండేషన్‌ సహకారం కోరుతున్నామని వెల్లడించారు. గోషామహల్‌లో ఉస్మానియా ఆసుపత్రికి కొత్త భవనం నిర్మిస్తున్నామని, ప్రస్తుతం ఉన్న భవనాన్ని వారసత్వ కట్టడంగా అభివృద్ధి చేయాలని భావిస్తున్నామని చెప్పారు. మూసీని నైట్‌ ఎకానమీకి అనుగుణంగా తీర్చిదిద్దుతామని సీఎం పేర్కొన్నారు.

గ్లోబల్‌ సమ్మిట్‌కు ప్రత్యేక ఆహ్వానం

డిసెంబర్‌ 7, 8, 9 తేదీల్లో ఫ్యూచర్‌ సిటీలో నిర్వహించనున్న తెలంగాణ గ్లోబల్‌ సమ్మిట్‌కు తప్పక హాజరు కావాలని ప్రిన్స్‌ రహీమ్‌ అగా ఖాన్‌-Vను రేవంత్‌రెడ్డి ఆహ్వానించారు. 100కు పైగా దేశాల ప్రతినిధులు సమ్మిట్‌కు రానున్నారని తెలిపారు. 2047 నాటికి దేశ జీడీపీలో తెలంగాణ వాటాను 10 శాతానికి పెంచే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. 30 వేల ఎకరాల్లో ఫ్యూచర్‌ సిటీ నిర్మిస్తున్నామని, ఇది నెట్‌-జీరో సిటీగా రూపుదిద్దుకోనుందని చెప్పారు. విమానాశ్రయానికి కేవలం 20 నిమిషాల దూరంలో ఈ నగరం ఉంటుందని వివరించారు. సింగపూర్‌కు చెందిన సంస్థ ఫ్యూచర్‌ సిటీ మాస్టర్‌ప్లాన్‌ రూపొందిస్తోందని తెలిపారు. 15 వేల ఎకరాల్లో గ్రీన్‌ జోన్‌ ఏర్పాటు చేస్తున్నామని, అమెజాన్‌ వంటి సంస్థలు ఇప్పటికే తమ కార్యకలాపాలు ప్రారంభించాయని రేవంత్‌రెడ్డి వెల్లడించారు.

 

#RevanthReddy #PrinceRahimAgaKhan #RahimAgaKhanV #AgaKhanFoundation #TelanganaHeritage #HeritageConservation #QutbShahiTombs #MusiRiver #MusiRiverRevival #OsmaniaHospital #CityCollege #FutureCity #TelanganaFutureCity #NetZeroCity #TelanganaGlobalSummit #Hyderabad #TelanganaDevelopment #TelanganaGovernment #RevanthReddyNews #TelanganaNews #HyderabadNews #HeritageRestoration #GlobalSummit