మెగా డీఎస్సీ-2025 నియామకాల్లో, ముఖ్యంగా స్పోర్ట్స్ కోటా ఉద్యోగాల భర్తీలో అక్రమాలు జరిగాయని వైఎస్సార్సీపీ ఆరోపించింది. ఈ వ్యవహారంపై వెంటనే సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 21న విజయవాడలోని శాప్ కార్యాలయం ఎదుట నిరసన చేపడతామని మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రకటించారు. తాడేపల్లిలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, దేవినేని అవినాశ్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. స్పోర్ట్స్ కోటాలో తప్పుడు సర్టిఫికెట్లతో అనర్హులకు ఉద్యోగాలు కట్టబెట్టారని, అర్హులైన నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆరోపించారు. కొన్ని సర్టిఫికెట్లు తప్పుడువని ప్రభుత్వ శాఖల్లోనే తేలుతున్నాయని చెప్పారు. నియామకాలు పారదర్శకంగా జరిగాయని ప్రభుత్వం చెబుతున్నప్పుడు సీబీఐ విచారణకు ఎందుకు వెనుకాడుతోందని ప్రశ్నించారు.
అర్హులకు న్యాయం జరిగే వరకు పోరాటం
డీఎస్సీ నియామకాలపై రోజుకో ఆరోపణ వస్తున్నా ప్రభుత్వం న్యాయ విచారణకు ఎందుకు ముందుకు రావడం లేదని అంబటి రాంబాబు నిలదీశారు. ఆరోపణలకు అధికారులు సమాధానం చెప్పడం కాకుండా ప్రభుత్వమే పూర్తి వాస్తవాలను ప్రజల ముందుంచాలని డిమాండ్ చేశారు. డీఎస్సీతో పాటు ఏపీపీఎస్సీ నియామకాలపై కూడా ఆరోపణలు ఉంటే రెండింటిపైనా సీబీఐ విచారణ జరపాలని కోరారు. కష్టపడి చదివి ఉద్యోగాల కోసం ఎదురుచూసిన నిరుద్యోగులకు అన్యాయం చేయడం దారుణమన్నారు. తప్పుడు సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందిన వారిపై చర్యలు తీసుకుని, అర్హులైన అభ్యర్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. తప్పు జరగలేదని ప్రభుత్వం నమ్మితే సీబీఐ విచారణకు సిద్ధపడాలని సవాల్ చేశారు. నిరుద్యోగులకు న్యాయం జరిగే వరకు వైఎస్సార్సీపీ పోరాటం కొనసాగుతుందని అంబటి స్పష్టం చేశారు
#YSRCP #YSRCPProtest #MegaDSC #MegaDSC2025 #APDSC #DSCRecruitment #DSCIrregularities #DSCControversy #AmbatiRambabu #CBIProbe #SportsQuota #FakeSportsCertificates #TeacherRecruitment #APTeacherJobs #APPSC #APPSCRecruitment #Unemployment #Vijayawada #SAPOffice #AndhraPradeshPolitics #APPolitics #YSRCPNews #APNews #TeacherJobs #PoliticalNews











