Home AP జగన్‌ను టార్గెట్‌ చేయడం మానుకోండి

జగన్‌ను టార్గెట్‌ చేయడం మానుకోండి

సీఎం చంద్రబాబుపై కొడాలి నాని ఫైర్.

మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నేత కొడాలి నాని సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. చంద్రబాబు వెన్నుపోటు రాజకీయాలకు ప్రతీక అని ఆరోపించారు. 16 ఏళ్ల పాలనలో చంద్రబాబు ఒక్కసారి మాత్రమే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించారని, ఇప్పుడు వైఎస్‌ జగన్‌ ఎన్నికలకు భయపడుతున్నారంటూ దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. భయం అంటే తెలియని నాయకుడు జగన్‌ అని అన్నారు. డీఎస్సీ పేరుతో ఉద్యోగాలను అమ్మేశారని, కొంతమంది కోసం స్పోర్ట్స్‌ జీవోలను మార్చారని ఆరోపించారు. చంద్రబాబు, లోకేశ్‌ అవినీతికి అంతులేకుండా పోయిందని విమర్శించారు. జగన్‌ను చర్చకు రావాలని లోకేశ్‌ పిలవడంపై స్పందిస్తూ.. జగన్‌తో చర్చించే స్థాయి లోకేశ్‌కు ఉందా అని ప్రశ్నించారు. పేర్ని నాని చర్చకు వస్తానన్న సమయంలోనే లోకేశ్‌ వెనక్కి వెళ్లిపోయారని ఆరోపించారు. ప్రజలకు ఇచ్చిన మాట కోసం జగన్‌ కట్టుబడి ఉంటారని, నీతి, నిజాయితీ, నిబద్ధతతో పనిచేసే నాయకుడని కొడాలి నాని పేర్కొన్నారు.

సూపర్‌ సిక్స్‌పై నిలదీత

చంద్రబాబు అధికారమే లక్ష్యంగా రాజకీయాలు చేస్తున్నారని కొడాలి నాని విమర్శించారు. ఎన్నికల సమయంలో ‘సూపర్‌ సిక్స్‌’ పేరుతో భారీ హామీల జాబితా ఇచ్చారని, అందులో ఎన్ని హామీలు అమలు చేశారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. మోసపూరిత హామీలతోనే చంద్రబాబు అధికారంలోకి వచ్చారని ఆరోపించారు. పేర్ని నాని, ఆయన భార్యపై కేసులు పెట్టి వేధించినా ఆయన వెనక్కి తగ్గలేదన్నారు. వల్లభనేని వంశీని కూడా ఉద్దేశపూర్వకంగా కేసులతో ఇబ్బంది పెట్టారని ఆరోపించారు. భోగాపురం విమానాశ్రయం, వెలిగొండ ప్రాజెక్టుపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ విమర్శలు గుప్పించారు. వెలిగొండ ప్రాజెక్టు టన్నెల్‌ గురించి చంద్రబాబుకు అవగాహన లేదని అన్నారు. చివరగా చంద్రబాబు, లోకేశ్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. “వెన్నుపోటు సామ్రాట్‌ను, వెన్నుపోటు పార్టీని బంగాళాఖాతంలో కలిపేయాలి” అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

#KodaliNani #ChandrababuNaidu #NaraLokesh #JaganMohanReddy #YSRCP #TDP #SuperSix #SuperSixPromises #APPolitics #AndhraPradeshPolitics #APPoliticalNews #YSRCPNews #Chandrababu #Lokesh #KodaliNaniComments